బిక్కవోలు చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో బియ్యం,దుప్పట్లు,వస్త్రాలు,చీరలు పంపిణీ
బిక్కవోలు,పెన్ పవర్
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం లో నల్లమిల్లి క్రీస్తు సంఘము ద్వారా నిర్వహించ బడుతున్న బిక్కవోలు ఛారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో 300 మంది అర్హులైన వృద్దులకు, పేదలకు విద్యార్ధులకు, విధవరాండ్రకు బియ్యం, చీరలు, దుప్పట్లు , బట్టలు, మరియు బహుమతుల పంపిణీ కార్యక్రమము క్రీస్తు సంఘ ఆవరణం లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిది అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, విశిష్ట అధితులుగా అనపర్తి సర్పంచ్ వారా కుమారి,చిర్ల వీర రాఘవ రెడ్డి,జిల్లా ప్రదాన కార్య దర్శి అనపర్తి గ్రామ ఉప సర్పంచి నల్లా దుర్గా ప్రసాద్,నల్లమిల్లి వైస్సార్సీపీ నాయకులు మట్టా శ్రీను ఎం.పి.టి.సి, నల్లమిల్లి ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ముప్పిడి జాన్ డీన్ అధ్యక్షతవహించగా, ఉపాద్యక్షురాలు స్వరాజ్య లక్ష్మీ ,సెక్రెటరీ కర్రీ సూర్య రావు మరియు కార్యవర్గ సభ్యులు కార్యక్రమమును నిర్వహించిరి.ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కి.శే ముప్పిడి శామ్యూల్ రాజు విగ్రహమునికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంధర్భంగా అనపర్తి శాసన సభ్యులు మాట్లాడుతూ ఈ సంస్థ వ్యవస్థాపకులు ముప్పిడి శామ్యూల్ రాజు ఆశయాలను కొనసాగిస్తున్న కార్యవర్గ సభ్యులను అభినందించిరి.పేదల పట్ల శామ్యూల్ రాజు ప్రేమ పూర్వక స్వభావము వారి దాన గుణమును,వారి సంస్థల ద్వారా మాత్రమే గాక ,కోవిడ్ సమయంలో వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంతటా చేసిన సేవలను గుర్తు చేసుకుని కొనియాడారు.శామ్యూల్ రాజు చివరి కొరికైనా సింగంపల్లి,నల్లమిల్లి గ్రామాలు వీధిలైట్లు వేయుటకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఎమ్మెల్యే సభలో ప్రకటన చేయడం జరిగింది.
శామ్యూల్ రాజు అనంతరం వారి కుటుంబం ఏదో విధంగా కష్టపడి దాతల నుండి తెచ్చి ఇంత గొప్పగా పెదలను ఆదుకున్నందుకు జాన్ డీన్ వారి కుటుంబాన్ని వారి సిబ్బందిని ప్రత్యేకం గా అభినందించారు.ఎమ్మెల్యే వారి చేతులమీదుగా పేదలకు,విధవరాళ్లు చీరలు , దుప్పటి + బియ్యం 5 కేజి వృద్దులులకు బట్టలు, దుప్పట్లు బియ్యం 5 కేజి,స్కినర్ గార్డెన్ స్టాఫ్ చీరలు ,దుప్పట్లు బిక్కవోలు స్టాఫ్ చీరలు, దుప్పటి స్టూడెంట్స్ యూనీఫార్మ్ , దుప్పటి, చిల్డ్రన్ హోమ్ పిల్లలు – బట్టలు, దుప్పటి, గిఫ్ట్ బ్యాగ్ , బూట్లు , స్కూల్ బ్యాగ్ , చాక్లెట్లు, బైబిలు కాలేజీ ఫ్యాకల్టీ బట్టలు మరియుచీర , గ్లోబల్ విజన్ స్టాఫ్ -బట్టలు అనంతరం కార్యక్రమ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రేమ విందు సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది.
No comments:
Post a Comment