కేసుల వివరాలు సత్వరమే కంప్యూటీకరించాలి
పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సిసిటిఎన్ఎస్ వెబ్ సైట్ లో అఫ్ లోడ్ చేయాలని విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సత్యన్నారాయణరావు పోలీసు, అధికారులకు, సిబ్బందికి ఆదేశించారు.టెక్నికల్ సర్వీసెస్ డిఐజి జి.పాలరాజు ఆదేశాలతో విజయనగరం జిల్లా పోలీసు సమావేశం మందిరంలో
శుక్రవారం నాడు పోలీసు స్టేషన్ రైటర్లు, ఈకాప్స్ కంప్యూటర్ ఆపరేటర్లకు కేసుల వివరాలను సిసిటిఎన్ఎస్ లో అప్ లోడ్ చేయడం గురించి, కేసు ఫైల్స్ ను సక్రమంగా నిర్వహించడం గురించి ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో పోలీసు స్టేషన్ రైటర్లు, ఈకాప్స్ కంప్యూటర్ ఆవ రేటర్లను ఉద్దేశిస్తూ అదనపు ఎస్పీ
పి. సత్యన్నారాయణరావు మాట్లాడుతూ - పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు.. ఎఫ్.ఐ.ఆర్, అరెస్టు,
చార్జిషీటు,జడ్జిమెంట్ మరియు ఇతర వివరములను, అండర్ ఇన్విస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరములను ఎప్పటికప్పుడు సిసిటిఎన్ఎస్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలన్నారు. రహదారి ప్రమాదాలు, ఆస్తి దొంగతనం, మహిళలపై జరిగే నేరాలు, కొట్లాట కేసుల మరియు ఇతర రకముల కేసుల వివరములును వాటికి సంబంధించిన హెలో అప్లోడ్ చేయాలన్నారు.
ఎస్ఈబి కేసులు, గనుల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులలో పట్టుబడిన వాహనాలను, సక్రమమంగా భద్రపరిచి, సంబంధిత అధికారల నుండి లేదా సంబంధత కోర్టుల నుండి రిలీజ్ ఆర్డర్లు వచ్చిన తర్వాత వాటిని సంబంధిత వ్యక్తులకు అప్పగించాలని, అప్పటి వరుకు సేఫ్ కస్టడీలో ఉంచాలన్నారు. స్పందన ఫిర్యాదుల పై తక్షణమే విచారణ పూర్తి చేసి వారం రోజులలోగా రిఫైలు పంపించాలన్నారు. నమోదు ఐన కేసుల వివరాలను ఎపటికప్పుడు సిసిటిఎన్ఎస్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తేనే స్టేట్ క్రైమ్ రికార్డుబ్యూరో వివరాలకి, జిల్లా క్రైమ్ రికార్డు బ్యూరో లో వివరాలు బ్యాలన్స్ అవుతుందని, కాబట్టి కేసుల వివరాలు ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయాలన్నారు.డి.సి. ఆర్. బి సిఐ బి.వెంకటరావు మాట్లాడుతూ - సిసిటిఎన్ఎస్ వెబ్ సైట్ లో కేసుల వివరములు హెలవారీగా అప్ లోడ్ చేసే విధానం గురించి వివరించారు. ఎమ్.సి.ఆర్ రిపోర్టులను ప్రతినెలా 1వ తేదీనుండి 3వ తేదీలోగా జిల్లా పోలీసు కార్యాలయానికి పంపించాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో డి.సి. ఆర్. బి సిఐ బి.వెంకటరావు, ట్రైనీ ఎస్ఏలు, పోలీసు స్టేషను రైటర్లు, ఈ-కాప్స్ కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment