Followers

మానవత్వాన్ని చాటుతున్న తాజ్ తెలంగాణ బేకరీ ఉస్మాన్ పాషా

 మానవత్వాన్ని చాటుతున్న తాజ్ తెలంగాణ బేకరీ ఉస్మాన్ పాషా


బెల్లంపల్లి, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని బేకరీ యజమాని మానవ సేవే మాధవ సేవా అంటూ తనకు తోచినంతలో సేవా కార్యక్రమాలు చేస్తూ, ప్రతీ గురువారం యాచకులకు అన్నదానం చేస్తూ, బెల్లంపల్లి పట్టణంలోని యువతకు ఆదర్శంగా నిలుస్తున్న మన తాజ్ తెలంగాణ బేకరీ నిర్వాహకులు ఉస్మాన్ పాషా ఈ గురువారం అన్నదాన కార్యాక్రమం నిర్వహిస్తుండగా ఒక ముసలావిడ కాళ్లకు చెప్పులులేకుండా , ముఖానికి మాస్క్  లేకుండా తాజ్ తెలంగాణ బేకరీ వద్ద అన్నదానం కార్యక్రమం చేస్తుండగా గమనించి ఆకలితో అక్కడికి వచ్చింది ఆ ముసలావిడను ఎర్రని ఎండలో కాళ్లకు చెప్పులు, ముఖానికి మాస్క్ లేకపోవడం గమనించిన ఉస్మాన్ పాషా వెంటనే స్పందించి ఒక జత కొత్త చెప్పులు, మాస్క్ ను అందించడం జరిగింది. అప్పుడు ఆ ముసలావిడ చేతులెత్తి నమస్కరించి నా బాధను ఎవ్వరు అర్ధం చేసుకోలేకపోయారు కానీ నా బాధను నువ్వు అర్ధం చేసుకున్నావయ్యా అంటూ కృతజ్ఞతలు తెలిపింది . ఈ సందర్భంగా ఉస్మాన్ పాషా ను పలువురు ప్రశంసించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...