ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు
లక్షెట్టిపెట్, పెన్ పవర్
ప్రజా సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం హజీపూర్ మండలంలోనీ టికన్నపల్లి గ్రామం నుండీ పెద్దంపేట్ గ్రామం వరకు ఆర్ అండ్ బీ నిధులు నుండీ కోటి 23లక్షల రూపాయల వ్యయంతో రోడ్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్వర్యంలో గ్రామల అభివృద్ధికీ ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్దపీట వేస్తూ అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తుందన్నారు.గ్రామ స్వరాజ్యం కొరకు గాంధీజి కన్న కలలను ముఖ్యమంత్రి కేసిఆర్ నిజం చేస్తున్నారనీ గుర్తుచేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చెందాలన్నా ఉద్ద్యేశాంతో గ్రామాల్లో చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్, ట్రాలీ, అలాగే పల్లే ప్రకృతి వనలు, డంపింగ్ యార్డ్లు, వైకుంఠ దామలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ దేనాని కొనియాడారు. గత ఫిబ్రవరి ఈ నెలలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు భట్టి విక్రమార్క తమ పర్యటనలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి నీరు వచ్చి చేరుతుందని అబద్ధపు మాటలు మాట్లాడారన్నారు. దిగువలో ఉన్న మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు లోకి నీరు వచ్చి చేరుతుంటే అబద్ధాల మాటలు చెబుతూ కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, బాధతో ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి మాట్లాడడం జరిగిందన్నారు. అనంతరం హాజీపూర్ పల్లె పకృతి వనంను,నర్సరీని పరిశీలించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45సంవత్సరాలు నిండిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్,వైస్ ఎంపీపీ బెతూ రమాదేవి రవి, తెరాస పార్టీ మండల అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, సర్పంచ్ మల్లేశ్వరి దుర్గయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పూస్కూరి శ్రీనివాస్ రావు, పీఏసీఏస్ చైర్మన్ లు ఆయా గ్రామాల సర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment