Followers

జీరో మలేరియా కేసులే లక్ష్యం

 జీరో మలేరియా కేసులే లక్ష్యం

చిత్తూరు ,  పెన్ పవర్

ఈ నెల 25 వ తేది జరగబోయే ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జీరో మలేరియా కేసులే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి డా.పెంచలయ్య పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాదికారి కార్యాలయంలో ఈ నెల 25 వ తేది జరగబోయే ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి మరియు జిల్లా మలేరియాధికారి సంయుక్త ఆద్వర్యంలో మలేరియా సబ్ యూనిట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా మలేరియాధికారి సంయుక్తoగా ప్రపంచ మలేరియా దినోత్సవ పోస్టర్ లను ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ 2022 సంవత్సరం ముగింపు నాటికి మలేరియా రహిత జిల్లాగా చిత్తూరును తీర్చిదిద్దుటకు వైధ్య ఆరోగ్య శాఖ సిబ్బంది సహకారంతో అలాగే ఇతర శాఖల సమన్వయంతో కృషి చేయాలన్నారు. జిల్లా మలేరియా అధికారి పైడిరాజు మాట్లాడుతూ ప్రజలందరూ ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించి దోమలు అభివృద్ది చెందకుండా, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మలేరియా సబ్ యూనిట్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...