మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్థిక సాయం
తాళ్లపూడి, పెన్ పవర్ఆదివారం 4-4-2021 తారీఖున తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలో క్యాన్సర్ తో బాధపడుతున్న నక్కా శ్రీనుబాబు భార్య నక్కా భాను కి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ, తాళ్లపూడి శాఖ తరపున రూ. 4,000, సెక్రెటరీ జోడాల వెంకటేశ్వరరావు రూ.500, ఈసి సభ్యులు అంకెం సురేష్ రూ.1000, డెంటిస్ట్ డాక్టర్ గోళ్ళ సాగర్ రూ.500, మరొక డెంటిస్ట్ డాక్టర్ విజయ్ రూ.500, చి" మాస్టర్ పి.యస్వంత్ రూ.500 మొత్తం కలిపి రూ. 7,000 వైద్యం నిమిత్తం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో అధ్యక్షులు బారనాల శంకరరావు, ఉపాధ్యక్షులు తుంపూడి నాగ భూషణగుప్త, గజ్జరం సర్పంచ్ గండి రాంబాబు, సభ్యులు మల్లిపూడి శోభన్ బాబు, గ్రామ పెద్దలు వల్లభని శ్రీహరి, బోడిగడ్ల గోవింద్, అంబేడ్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment