Followers

ఎన్నికల కోడ్ ఉల్లంఘన

ఎన్నికల కోడ్ ఉల్లంఘన

సంతబొమ్మాళి,పెన్ పవర్

మళ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది.ఎవరి హడావుడి వాళ్లదే కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని తెలిసిన పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. వివరాల్లోకి వెళితే జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో, ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ మండల కేంద్రం సంతబొమ్మాళి లో అధికారులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. సచివాలయాల బోర్డులపై, 108 వాహనం, రేషన్ పంపిణీ వాహనంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్నప్పటికీ వాటిని మూయలేదు. వీటిని అధికారులు చూస్తున్నా పట్టించుకోవడంలేదని విమర్శలు ఉన్నాయి. వడ్డితాండ్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఫోటోతో కూడిన బోర్డు దర్శనమిస్తుంది. 

అలాగే అనేక గ్రామాలలో వైయస్సార్ ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు సంబంధించిన వివరాలతో కూడిన పోస్టర్లు వెలిశాయి. సంతబొమ్మాళి బస్టాండ్ లో టిడిపి అచ్చెన్నాయుడు ఫోటోలతో కూడిన పోస్టర్లు వెలిశాయి. వీటిని కూడా అధికారులు చూస్తున్న తొలగించే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎన్నికల  కోడ్ ఉల్లంఘించే పోస్టర్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. వీటిపై మండల ప్రత్యేకాధికారి జెడి శ్రీనివాస్ ను  వివరణ కోరగా తక్షణమే తొలగించేలా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ఎవరైనా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...