మహమ్మారి కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
శుక్రవారం ఫ్రైడే కార్యక్రమంలో ఆరిమాకుల పల్లి గ్రామంలో ప్రజలకు కరోనా వ్యాధి పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సి హెచ్ ఓ మాట్లాడుతూ కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, వ్యక్తిగత దూరాన్ని పాటించాలని, తరచూ చేతులను మొహాన్ని సబ్బుతో శుభ్రపరచుకోవాలి అని ఆయన సూచించారు. వేసవికాలంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రైతులు, పశువుల కాపరులు ఉదయం 10 గంటల వరకు అటు పిమ్మట సాయంత్రం నాలుగున్నర గంటల పైన పొలం పనులకు, పశువుల మేపుటకు వెళ్లాలని సూచించారు. ఎవరికైనా వడదెబ్బ వచ్చినట్లు అనిపిస్తే సత్వరం వారికి ఓ ఆర్ ఎస్ తాగి చాలని అన్నారు. అలా లేని పక్షంలో కొద్దిగా ఉప్పు కలిపి తాగించాలి అన్నారు. అనంతరం వారిని సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్సలు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ తోపాటు మహిళా ఆరోగ్య కార్యకర్తలు భాగ్య మేరీ, అపర్ణ శిల్పా, అమ్ములు, ఆశా కార్యకర్తలు రమా, అంజలి, భువనేశ్వరి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment