Followers

సముద్రంలోకి సురక్షితంగా ఆలివ్ రిడ్లే తాబేళ్లు

 సముద్రంలోకి సురక్షితంగా  ఆలివ్ రిడ్లే తాబేళ్లు

సంతబొమ్మాళి, పెన్ పవర్

గత పది సంవత్సరాల నుండి  అటవీశాఖ, ట్రీ ఫౌండేషన్ కలిసి సముద్ర తాబేలను సంరక్షణ చేస్తున్నారు. అరుదైన ఉభయ చర జీవుల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఒకటి.  జపాన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశ సముద్ర జలాల్లో అధికంగా కనిపించే ఈ రకమైన  తాబేల్లు కేవలం గుడ్లు పెట్టేందుకు మన బావనపాడు తదితర సముద్ర తీరానికి చేరుకుంటున్నాయి. రాత్రి సమయంలో తీరంలోని ఇసుక తిన్నెల్లో గుడ్లు పెట్టి సముద్ర జలాల్లోకి చేరుకుంటున్నాయి. పెట్టిన గుడ్లను అటవీశాఖ అధికారులు ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు సంయుక్తంగా  ఏర్పాటు చేసి ఈ అరుదైన తాబేళ్ల కు జీవం పోస్తున్నారు. తల్లి తాబేల్లు ఇసుకతిన్నెలలో పెట్టిన గుడ్లు పక్షులు, జంతువులు, దొంగల బారిన పడకుండా హ్యాచరీ లో సురక్షితంగా భద్రపరుస్తున్నారు. మండలంలో శుక్రవారం భావనపాడు హ్యాచారీ నుండి భద్రపరిచిన తాబేలు పిల్లలను టెక్కలి అటవీశాఖ రేంజర్ పీవీ శాస్త్రి ఆధ్వర్యంలో సర్పంచ్ బుడ్డ మోహన్ రెడ్డి సముద్రంలోకి విడిచిపెట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరి నుంచి మార్చి వరకు తల్లి తాబేలు గుడ్లు పెట్టే సమయమని వివరించారు. అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు సంతతిని పరిరక్షించడానికి, వాటి గుడ్లను సేకరించి ప్రత్యేకించి తొలగించి మళ్లీ సముద్రంలోకి లక్షలాది చిరుజీవులను విడిచిపెట్టే గొప్ప ప్రయత్నం భావనపాడులో నిరంతరం సాగుతుందని తెలిపారు. సముద్ర తాబేలు సంతతిని పెంచడానికి కృషి చేస్తున్నామని, అటవీశాఖ, ట్రీ ఫౌండేషన్ తో పాటు మేము  పనిచేస్తూ తాబేలును సంరక్షిస్తున్నమని అన్నారు. భావనపాడు లో ప్రత్యేకంగా హ్యాచారీ లను ఏర్పాటు చేసి, వాలంటీర్ల ద్వారా వేలాది గుడ్లను సేకరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ భీమారెడ్డి , పంచాయితీ కార్యదర్శి కెపిసిహెచ్ వి బి  రాజు తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...