వాడపల్లి వెంకటేశ్వర స్వామి కల్యాణ వార్షికోత్సవం భక్తులు అనుమతి లేదు
పెన్ పవర్, ఆత్రేయపురం
వాడపల్లి గ్రామంలో వేచేసియున్న కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి అలివేలుమంగా పద్మావతి కల్యాణ వార్షికోత్సవనకు భక్తులకు అనుమతి లేదు. దేశంలో సెకండ్వే కరోనా విజృంభించిన వేళ ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమ్ము కూడదని ఉద్దేశంతో భక్తులకు అనుమతి రద్దు చేయడం జరిగినదని ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు తెలియజేశారు. ఉన్నతాధికారులను స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామ సర్పంచ్ పెద్దలు ధర్మకర్త చైర్మన్ లతో పలుమార్లు సంప్రదింపులు జరిపిన తర్వాతే భక్తులు ఆరోగ్యం బాధ్యత దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక కల్యాణోత్సవాలకు భక్తులకు అనుమతించకూడదని నిర్ణయించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలియజేశారు.
No comments:
Post a Comment