నిండు కుండల మారిన ఎగువ మానేరు
హర్ష వ్యక్తం చేస్తున్నా రైతులు
గంభీరావుపేట , పెన్ పవర్
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లోని ఎగువ మానేరు నిండు కుండల మారింది. కాళేశ్వరం గోదారమ్మ నీరు మండే ఎండలో కూడవెల్లి వాగు నుండి గల గల నీరు పారుతున్నాయి. కొండ పోచమ్మ ద్వారా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం ఎగువ మానేరు లోకి చాల వేగంగా వచ్చి నీరు చేరుతున్నాయి, నర్మాల ప్రాజెక్టు లోకి గోదావరి నీరు చేరడంతో రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 31అడుగులు ఉండగా శనివారం వరకు 29 అడుగుల నర వరకు వచ్చి చేరాయి. మరో రెండు రోజు ల్లో పరవళ్లు తొక్కడానికి నర్మాల ఎగువ మానేరు సిద్ధం అవుతుంది. ఏటా 13 వేల ఎకరాలు సాగు భూమి సాగు లోకి రానున్నాయి. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.70 ఏండ్ల మానేరు చరిత్ర లో వర్ష కాలం లోనే నిండటం చరిత్ర లో అద్భుతం అని తెలాంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ,మంత్రి కేటీఆర్ కు గంభీరావుపేట మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ధ్యానబోయిన రాజేందర్. తెరాస నర్మాల గ్రామశాఖ అధ్యక్షుడు ఎడబోయిన రత్నాకర్, నర్మాల ఎగువ మానేరు ను సందర్శించారు. మరియు గ్రామ ల రైతులు కేసీఆర్ ,కేటీఆర్ కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment