ప్రగాఢ సానుభూతి తెలిపిన పోలీసు అధికారులు
జగదీష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పోలీసు అధికారులు చత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన సిఆర్ పిఎఫ్ మరియు మావోయిస్టు దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన విజయనగరం పట్టణం గాజులరేగకు చెందిన సిఆర్పిఎఫ్ కోబ్రా కమాండర్ రౌతు జగదీష్ కుటుంబాన్ని విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎల్.కే.వి.రంగారావు మంగళవారం నాడు పరామర్శించి,ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎల్.కే.వి.రంగరావు, విశాఖపట్నం రూరల్ ఎస్పీ బి. కృష్ణా రావు విజయనగరం పట్టణం గాజులరేగలోని రౌతు జగదీష్ కుటుంబం నివాసం ఉంటున్న ఇంటికి వెళ్ళి, అతని తల్లిదండ్రులు సింహాచలం, రమణమ్మ దంపతులను కలిసి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
జగదీష్ పార్ధివ శరీరంపై విశాఖ రేంజ్ డిఐజి ఎల్.కే.వి.రంగారావు, విశాఖపట్నం రూరల్ ఎస్పీ బి.కృష్ణారావు రీత్ లను, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సిఆర్ పిఎఫ్ అధికారులు, జిల్లా పోలీసుశాఖ జగదీష్ అంతిమ యాత్రలో పాల్గొని, పోలీసు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అధికార లాంఛనాల్లో భాగంగా పార్ధివ శరీరంను స్మసానం వరకు పోలీసు బ్యాండుతో సాగనంపి, సిఆర్ పి ఎఫ్ మరియు జిల్లా పోలీసుశాఖకు చెందిన ఆర్మడు రిజర్వు పోలీసులు తుపాకులతో మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి, గౌరవ వందనం సమర్పించారు.అమర వీరుడు రౌతు జగదీష్ అంతిమ యాత్రలో విశాఖపట్నం రూరల్ ఎస్పీ బి. కృష్ణారావు, పార్వతీపురం ఒఎస్ డి ఎన్.సూర్యచంద్రరావు, అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సత్యన్నారాయణరావు, విజయనగరం డిఎస్పీ పి. అనిల్ కుమార్, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, ఎస్బీ సిఐ ఎన్.శ్రీనివాసరావు, విజయనగరం రూరల్ సిఐ టి.ఎస్. మంగవేణి, 2వ పట్టణ సిఐ సిహెచ్. శ్రీనివాసరావు, 1వ పట్టణ సిఐ జె.మురళి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో ఉన్నారు.
No comments:
Post a Comment