కార్మికుల పట్ల యాజమాన్యం ఒంటెద్దు పోకడ సరికాదు సి ఐ టి యు
పెన్ పవర్, మందమర్రియాజమాన్యము తాజాగా కార్మికులందరికీ ప్లెడే పీహెచ్డీ లను తగ్గింపు చేస్తూ సర్క్యులర్ జారీ చేయడం ఒంటెద్దు పోకడ పోవడం సరికాదని సి ఐ టి యు బ్రాంచ్ సెక్రెటరీ వెంకటస్వామి అన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూసాధించిన ప్రగతి పేరిట పుస్తకాలు పంచుతూ ప్రకటనలకు ఖర్చు పెడుతూ ఖర్చులు తగ్గింపు పేరిట గత సంవత్సరం క్యాలెండర్ ఇవ్వకపోగా, ప్రొడక్షన్ కాలంలో స్పెషల్ ఇన్సెంటివ్ ను ఇవ్వ కుండా ఇప్పటి నుండే ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని ముందుకు పోతున్న తరుణంలో కార్మికులు తగ్గి పని ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో యాజమాన్యం ఉత్పత్తి కోసం శ్రమించే కార్మికుల ప్లెడే, పి.హెచ్.డి. లను తగ్గింపు చేస్తుంటే కార్మికులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతారు. కేవలం ప్రభుత్వ అనుకూల సంఘాల వలన యాజమాన్యం ఇలాంటి ప్లేడెల కుదింపు, ఎండలు ముదిరినందున ఓపెన్ కాస్ట్ లలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం లేదని, సమయ వేళలు మార్చ వలసిన సమయంలో మార్చకుండా ఎండల వలన కోవిడ్ వాక్సిన్ వలన డ్యుటిలకు రాకుండా ఉంటుంటే కరోనా టెస్టులకు పంపుతామనీ భయానికి గురిచేయటమె ననీ, సీఎం పిఎఫ్ చిట్టీల ఆలస్యం గురించి పట్టించు కోవడం లేదని అవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నీ ఇంకా గుర్తింపు ఉందన్న సంఘంకు తెలవకుండా జరగడం లేదని ప్రతిపక్ష సంఘా ల తరపున మేం ఖండిస్తున్నామని చెప్పడం వారికే చెల్లుతుందని ఎద్దేవా చేశారు.ఈకార్యక్రమంలో మందమర్రి బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకట స్వామి కార్యదర్శి అల్లి రాజేందర్, సంజీవ్,ఐలయ్య,రాయమల్లు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment