Followers

ప్రజా సంక్షేమ మే టిఆర్ఎస్ ధ్యేయం

 ప్రజా సంక్షేమ మే  టిఆర్ఎస్ ధ్యేయం...

 ఆదిలాబాద్,  పెన్ పవర్

ప్రజా సంక్షేమానికి కేసిఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బేల మాజి సర్పంచ్ మస్కే తేజరావ్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ మండలంలోని లోహారా, అల్లఖోరి గ్రామ పంచాయతీ లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై ప్రచారం నిర్వహించారు. మారుమూల గిరిజన గ్రామాలకు కోట్లాది రూపాయలతో రోడ్డు సౌకర్యం కల్పించడంలో ఎమ్మెల్యే జోగు రామన్న ఎంతో కృషి ఉందని తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం చెందుతుందని పేర్కొన్నారు. పేదవారికి టిఆర్ఎస్ ప్రభుత్వం భరోసా గా నిలిచిందని కొనియాడారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా టిఆర్ఎస్ పక్షాన నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆత్రం సోము, గంగారాం, టిఆర్ఎస్ నాయకులు ధన్రాజ్, బాబాసాహెబ్, రామ్ హాల్, రామ్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...