Followers

కొవ్వురులో బాబు జగజ్జివన్ రావు వేడుకలు

 కొవ్వురులో బాబు జగజ్జివన్ రావు వేడుకలు

పెన్ పవర్, కొవ్వూరు

దళితుల అభ్యున్నతి కోసం పాటు పడిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రావ్ అని రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమ తి డాక్టర్ తానేటి వనిత అన్నా రు. సోమవారం ,కొవ్వూరు పట్ట ణం లో బాబు జగజ్జివన్ రావు  పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మంత్రి వారి క్యాంపు  కార్యాలయం లో, కొవ్వూరు  బజార్ లో ఉన్న బాబు జగ జ్జివన్ రావు  విగ్రహాలకి, కొవ్వూరు మెరక వీధి సెంటర్ లో బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహానికి మంత్రి పూల మాల తో  ఘన నివాళులు అర్పించా రు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూఆయన అడుగు జాడల్లో దేశం అభివృద్ధి పధం లో ముందుకు సాగేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని చె ప్పారు. అంటరానితనం రూపు మాపేందుకు ఎంతో కృషి చేసిన మహనీయులనీ అన్నారు.   ఆ యన ఉన్నత చదువులు చది వి బాగా కష్టపడి సమాజ అ భ్యున్నతికి కృషి చేయడం వల న అనేక పదవులు వరించాయ న్నారు.  ఆయన 50 ఏళ్ల రాజ కీయ ప్రస్థానం లో ఎన్నో మంచి పనులు చేశారన్నారు. ఆయన చేపట్టిన అన్ని పదవులకు న్యా యం చేశారన్నారు.  ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తె చ్చారని,  ఆయా రంగాల ప్రజ ల కు మేలు జరిగే కార్యక్రమా లు చేపట్టి అందరిలో మహనీ యునిగా నిలిచారని చెప్పారు.  సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఉన్నత పదవులు, ఉన్నత స్థాయి పేరు ప్రఖ్యాతులు ఉరికినే  ఎవరికీ అంత సుల భంగా రావన్నారు.  బాబు జగ జ్జీవన్ రామ్ ఉప ప్రధాని గా ఉండి, మంచి సంస్కరణ లు తీసుకువచ్చారని, ఎక్కడా రాజీపడకుండా  చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసారన్నారు. కొవ్వూరు పట్టణం లో ఏమయినా ప్రజలకు సమస్య లు ఉంటే వార్డు కౌ న్సిలర్లు, మునిసిపల్ చైర్మన్ వారి దృష్టికి తీసుకు వెళ్లాలని మంత్రి అన్నారు. అటువంటి గొప్ప వ్యక్తుల మహానుభావుల జీవితాలను  ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకో వాలన్నారు .  ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్ పర్సన్ భావన రత్నకుమారి, మాజీ ఎమ్మెల్యే, టి.వి.రామారావు అక్షయ పాత్ర శ్రీనివాస రవీంద్ర, ఆర్. భాస్కర రావు, వరిగేటి లలిత కుమారి, బత్తి. నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...