Followers

విద్యా వాలంటీర్లను పట్టించుకోని ప్రభుత్వం

 విద్యా వాలంటీర్లను పట్టించుకోని ప్రభుత్వం

 టీవీవిఎస్ మండల అధ్యక్షుడు మండల రాంబాబు.

చిన్నగూడూరు,  పెన్ పవర్

 కరుణ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రభుత్వo పాఠశాలలను మూసి వేసిన సందర్భంలో పాఠశాల లో పనిచేస్తున్న విద్యా వాలంటీర్ల కు ప్రైవేట్ టీచర్ ల మాదిరిగానే ఆర్థిక సహాయం చేయాలని మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల తెలంగాణ విద్యావాలంటీర్ల సంఘం అధ్యక్షుడు మండల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మండల కేంద్రంలో మాట్లాడుతూ. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13500 మంది విద్యా వాలంటీర్లు వారి పై ఆధారపడిన కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమై దిక్కుతోచని స్థితిలో ఉన్నాయనిఅన్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులకు ఇచ్చిన మాదిరిగానే నెలకు 2000 రూపాయలు, 25 కేజీల బియ్యం ఇచ్చి ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.  లేనిపక్షంలో 13500 మంది విద్యా వాలంటీర్లు ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో మండల టీవీవిఎస్ ప్రధాన కార్యదర్శి పిల్లి సైదన్న,  హరీష్,సురేష్, రమేష్,ఝాన్సీ, విజయ అశ్విని యమునా స్వాతి ప్రవీణ్,వెంకన్న,మాధవి, అనూష, జ్యోతి,సంధ్య,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...