యోగి వేమన యూనివర్సిటీ హాస్టల్ సిబ్బంది సమస్యలు పై చర్చలు విఫలం సమ్మె కొనసాగింపు
యోగి వేమన యూనివర్సిటీ హాస్టల్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని యోగి వేమన యూనివర్సిటీ హాస్టల్ అండ్ స్టాప్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి అనుబంధం)ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న కార్మికులతో రిజిస్ట్రార్ జరిపిన చర్చలు విఫలం కావడంతో గురువారం కూడ కొనసాగిస్తున్నట్లుగా ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి,యోగి వేమన యూనివర్సిటీ హాస్టల్ స్టాప్& వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షలు ఎల్. నాగసుబ్బారెడ్డి,డిప్యూటి జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా లు తెలిపారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలులో అమలు చేస్తున్నటువంటి వాటిని యోగి వేమన యూనివర్సిటీలో ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. సమ్మె నోటీసు ఇచ్చిన అధికారులు ముందస్తుగా చర్చలు జరగకపోవడం, స్పందించకపోవడం మూలంగానే ఆందోళన చేయాల్సిన పరిస్థితి దీనికి అధికారులే బాధ్యత వహించాలన్నారు. 24 గంటల డ్యూటీ చేసే పోలీసులకు వారాంతపు సెలవులు అమలు చేస్తున్నప్పుడు మరి హాస్టల్ సిబ్బందికి ఎందుకు అమలు పరచలేదో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లక్షల రూపాయలు వేతనాలు రూపంలో తీసుకుంటూ కిందిస్థాయి హాస్టల్ సిబ్బందిని సమస్యలు పట్టించుకోకపోవడం వారి అహంభావానికి నిదర్శనమన్నారు. విద్యార్థులతో హాస్టల్ ఫీజులు బలవంతంగా కాసిన్ డిపాజిట్ క్రింద డబ్బులు తీసుకొన్న యూనివర్సిటీ అధికారులు హాస్టల్ సిబ్బంది చేస్తున్నటువంటి ఆందోళనతో అధికారులు బెంబేలెత్తి విద్యార్థులను కరోన బూచి చూపించి సెలవులు ప్రకటించడం సమంజసం కాదన్నారు. వేతనాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని, వై వి యు లో కూడా చెల్లించాలని కోరడం, ఫుడ్ బేసిక్ మరియు డైలీ వేజెస్ వారికి ధరల సూచీ ప్రకారం వేతనాలు పెంచాలని, చనిపోయిన కార్మికుల కుటుంబంలో వారి వారసులకు అదే స్థానంలో ఉద్యోగం అవకాశం కల్పించాలని కోరడం ఏ విదంగా చట్టవిరుద్ధమో తేల్చాలన్నారు. 10 సంవత్సరాల పైబడి పని చేయుచున్న వారందరికీ టైం స్కేల్ వేతనాలు వివిధ యూనివర్సిటీలో వర్తింపు చేసినట్లుగా యోగి వేమన యూనివర్సిటీలో కూడా ఎందుకు ఇవ్వకూడదన్నారు. సామాజిక భద్రత చట్టాల్లో బాగంగా రిస్క్ అలవెన్సులు,ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి ఈఎస్ఐ, ఈపిఎఫ్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కుక్కు ,స్టీవార్డ్ , స్టోర్ కీపర్ సర్వర్ గా పనిచేయు వారికి క్యాంపస్ లో ఏవిధంగా గ్రేడింగ్ ఇచ్చారో అదే విధంగా డ్రైవర్, ప్లంబర్,ఎలక్ట్రిషన్ మొదలగు వారికి గ్రేడింగ్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామసుబ్బయ్య ,గంగాధర్ కోశాధికారి రాజేశ్వరి, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, కుతుబుద్దీన్ ,వెంకటరమణ, సహాయ కార్యదర్శులు చలపతి, నాగసుబ్బారెడ్డి, లక్ష్మీదేవి,రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment