విమ్స్ లో కోవిడ్ రోగులకు ప్రారంభమైన వైద్య చికిత్స సేవలు
మహారాణి పేట, పెన్ పవర్
కరోనా రెండవ దశ విశాఖ నగరంలో తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలో కరోనా వైరస్ సోకిన రోగులకు వైద్య చికిత్స నిమిత్తం విమ్స్ లో రోగులకు వైద్య సేవలు ప్రారంభించారు ఆదివారం 27 మంది రోగులు చేరగా,ఇద్దరు మరణించారు.కారణము వైద్య సేవలు అందించేందుకు సీనియర్ స్పెషలిస్టులు పర్యవేక్షణ లేక ? డాక్టర్స్ కి డిప్యుటేషన్ పద్ధతిలో ఆర్డర్స్ వచ్చినా జిల్లా యంత్రాంగము మరియు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ పట్టించుకోలేదు. డాక్టర్స్ కోర్ గ్రూప్ లో పల్మనాలజిస్ట్ లు (శ్వాసకోస స్పెషలిస్టులు) అనస్తీషియా,జనరల్ మెడిసిన్,మొదలగు విభాగాలలో క్రిటికల్ కేర్ అనుభవం ఉన్న సీనియర్ డాక్టర్స్ పర్యవేక్షణ లోపించడమే.విమ్స్ లో 500 పడకలకు ప్రస్తుతం 23 మంది డాక్టర్స్ కలరు.A,B,C,D,అను నాలుగు గ్రూపులుగా వైద్య సేవలను విభజిస్తే స్పెషలిస్టులు కావాలి. ఒక్కొక్క గ్రూపుకు నలుగురు చొప్పున సీనియర్ డాక్టర్స్ పర్యవేక్షణ ఉండాలి. ప్రస్తుతము సీనియర్ డాక్టర్స్ లేరు. కేజీహెచ్ లో సీనియర్స్, అసిస్టెంట్లు,అసోసియేట్, పీజీ డాక్టర్స్ సుమారు 600 మంది పైగా కలరు.300 మందిని అక్కడ సేవలకి ఉపయోగించు కుంటూ,మిగిలిన వారిలో ముఖ్య విభాగాల కు చెందిన వారి సేవలను విమ్స్ కి డిప్యూటేషన్ పద్ధతిలో కేటాయించాలి. ప్రజలకు సకాలంలో వైద్యము అందించుట ,ప్రాణాలను రక్షించుట ప్రభుత్వ అధికారుల దే బాధ్యత.తక్షణమే తగు నియామకాలు చేయాలి.భారతీయ జనతా పార్టీ వైద్య విభాగం కోరుతున్నది.
No comments:
Post a Comment