Followers

ప్రజా సేవకే నా జీవితం అంకితం

 ప్రజా సేవకే నా జీవితం అంకితం..

నా ప్రాణం కన్న ప్రజల ఆరోగ్యమే నాకు ముఖ్యం

కరోనా పట్ల ప్రజలు ఆధైర్య పడకండి..

మీ కోసం నేనున్నానని కొవిడ్ బాధితుల్లో మనోధైర్యం నింపిన.. 

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్



రామగుండం ,  పెన్ పవర్

 కారోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితులు కరోనా అంటేనే భయంతో వణికిపోతున్న సందర్భంలో గురువారం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ సందర్శించారు. తమ ప్రజల కోసం కోవిడ్ భారిన పడిన వారి ఆరోగ్య పరిస్థితులను తెలసుకునేందుకు ఎంతో ధైర్యంగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కారోనా వార్డుల్లో మరో మారు సందర్శంచిన సహస చందర్ డుగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నిలిచారు. కోవిడ్ వార్డుల్లో పిపి కిట్ ధరించి కోవిడ్ బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మీ ఆరోగ్యాల రక్షణ కోసం నేనున్నానంటూ వారిలో మనోధైర్యం నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కారోనా భారీ నుండి కపాడేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తగు విధమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రామగుండం నియోజవర్గంలోని కరోనా బాధితుల కోసం గతంలోనే 30 పడకల కోవిడ్ వార్డులను సిద్ధం చేశామని, కొవిడ్ బాధితులకు అన్ని రకాల వైద్య సదుపాయలను అందిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా ఆక్సిజన్ కు ఎలాంటి కొరత లేకుండా తగిన ఏర్పాటు చేశామన్నారు. కరోనా సెకండ్ వెవ్ పట్ల ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని, కారోనా నిర్ధారణ అయితే ఎలాంటి భయందోళనాలకు ప్రజలు గురి కావద్దన్నారు. డాక్టర్ల సలహాలు, సూచనాలు పాటిస్తు కరోనా నుండి కోలుకోవచ్చన్నారు. ప్రజలు మాస్కులు, సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్స్ తప్పకుండా వాడలన్నారు. రామగుండం ప్రజల సేవకే తన జీవితం అంకితమని కరోనా పట్ల ప్రజల ఆధైర్య పడవద్దని మీ అందరికి అండగా నిలుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...