కార్మిక లేబర్ కోడ్స్ తక్షణం రద్దు చేయాలి వామపక్ష కార్మిక సంఘాలు డిమాండ్
మహారాణి పేట, పెన్ పవర్
కార్మిక లేబర్ కోడ్స్ తక్షణం రద్దు చేయాలి వామపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ లేబర్ కోడ్స్ జీవోలు దగ్దం. బిజెపి ప్రభుత్వం కార్మికులకు నష్ట దాయకమైన నాలుగు లేబర్ కోళ్ళు తక్షణమే రద్దు చేయాలని సిఐటియు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆర్ కె యస్ వి కుమార్, పడాల రమణ డిమాండ్ చేశారు.నేడు జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మిక చట్టాల సవరణ జీవో కాపీలను జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద 4 కార్మిక లేబర్ కోడ్స్ కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ గా మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే కార్మిక చట్టాలు ఉన్న వాటిని సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. ఇప్పుడు యజమాని దయా దాక్షిణ్యాల మీద కార్మికుడు ఆధార పడాల్సి వస్తుందన్నారు. ఇది కార్మికుల ఉపాధికి తీవ్ర విఘాతం అన్నారు. పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దుచేసి హక్కు మోడీకి లేదన్నారు. తక్షణమే లేబర్ కోడ్స్ రద్దు చేయక పోతే పెద్ద ఎత్తున పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జగన్, సుబ్బారావు,చంద్రమౌళి,ఎఐటియుసి నాయకులు వామనమూర్తి,ఆనంద్,రాము తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment