Followers

ఘనంగా రామానుజ చార్యుల జయంతి

ఘనంగా రామానుజ చార్యుల జయంతి 

తార్నాక, పెన్ పవర్ 

విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన  భగవత్ స్వరూపులు శ్రీ రామానుజ చార్యుల వారి 1004 వ జయంతి ని  మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మల్లాపూర్ లోని ఎన్ ఎఫ్ సి  చౌరస్తా లో ఉన్న విగ్రహానికి  స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి. పూలమాలలు వేసి రామానుజ చార్యులను స్మరించుకున్నారు.  ఈ సందర్బంగా పన్నాల మాట్లాడుతూ జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు  అద్వైత సిద్ధాంతాన్ని స్థాపిస్తే, శ్రీ రామానుజ చార్యుల వారు విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారని తెలిపారు. వీరందరూ మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన భగవత్ స్వరూపులు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో  విద్యార్ధి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి  శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...