Followers

అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర

అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర 

అనకాపల్లి, పెన్ పవర్

ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా గురువారం, దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఉత్సవ ప్రత్యేక అధికారి ఎస్.జ్యోతి మాధవి ఆలయంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. రాతి దేవాలయ ప్రతిపాదించిన మ్యాప్  ఆమె అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  శ్రీ నూకాంబిక ఉత్సవాలు ఈ నెల 10 తారీకు నుండి మే 11 వరకు నెల రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి అని తెలియజేశారు. కరొన వ్యాధి రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ఆలయానికి వచ్చే భక్తులు అందరూ మాస్కు ధరించి రావాలని ఆమె తెలియజేశారు. మాస్క్ లేని ని భక్తులకు ఆలయంలో ప్రవేశం లేదని, ఆలయానికి వచ్చే భక్తులకు సిబ్బంది శానిటైజర్ చేయాలని ఆమె అన్నారు. ఉష్ణోగ్రత మిషన్ ద్వారా భక్తులకు చెక్ చేసి 100 లోపు ఉన్న వారిని ఆలయంలోకి పంపిస్తామని అని తెలియజేశారు. ఆలయము చుట్టూఉన్న వ్యాపారస్తుల అందరూ మాస్కులు, శానిటైజర్ వాడాలని లేనియెడల పోలీసు, రెవెన్యూ సిబ్బంది సహకారంతో  తొలగించబడుతుంది అని తెలియజేశారు, క్యూలైన్లలో ద్వారా వచ్చే భక్తులు దూరం పాటించి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్సవాల్లో సమన్వయ కమిటీతో ఇటీవలే మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని,పోలీసు,రెవెన్యూ,ఆరోగ్యశాఖ,విద్యుత్ శాఖలవారు ఉత్సవాల్లో స్టాల్స్ఏర్పాటు చేస్తారని తెలియజేశారు.పోలీస్ ఔట్ పోస్ట్ ఈ నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలకు విద్యుత్ శాఖ అధికారులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆమె విద్యుత్ శాఖ సిబ్బందితెలియజేశారు. జి.వి.ఎమ్.సి, సిబ్బంది, త్రాగునీరు,పారిశుద్ధ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని  తెలియజేశారు. ఆలయంలో జరుగుతున్న ఉత్సవ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు,ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ సిబ్బందికి సూచించారు. కరోణా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆమె తెలియజేశారు.అత్యవసర సమయములో 104,108 వెహికల్ కూడా ఉంటాయని తెలియజేశారు. ఆమె వెంట,జిల్లా ఖోఖో సంఘం అధ్యక్షులు దాడి జైవీర్, ఆలయ ఇంచార్జి ఈ ఓ, బి.ఎల్.నగేష్,దేవాదాయ శాఖ అధికారులు శ్రీనివాసరాజు,సైదులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...