జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి : జిల్లా కలెక్టర్
వ్యాక్సినేషన్, టెస్టింగ్ సంఖ్యను పెంచాలి
జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, కల్పిస్తున్న సదుపాయాలపై ఆరా
రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోజువారీగా వ్యాక్సినేషన్, టెస్టింగ్ సంఖ్యను పెంచాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ సిరిసిల్ల పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి చికిత్స పొందుతున్న రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి పై అంతస్తులో అదనంగా సమకూర్చిన 60 బెడ్స్ కు సెంట్రల్ ఆక్సిజన్ లైన్ అనుసంధానం చేసే ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోజువారీగా వ్యాక్సినేషన్, టెస్టింగ్ సంఖ్యను పెంచాలని ఆదేశించారు. రోజుకు ఎంత మంది పేషెంట్లు ఆసుపత్రికి వస్తున్నారు... ఎంత మంది ప్రస్తుతం కోవిడ్ తో చికిత్స పొందుతున్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, సరిపడా మందులు అందుబాటు లో ఉన్నాయా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వైద్యులకు ఆసుపత్రిలో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే తమకు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్శనలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీ డా.మురళీధర్ రావు, సిబ్బంది ఉన్నారు.
No comments:
Post a Comment