కరోనా కట్టడికి కలిసికట్టుగా కృషి చేద్దాం
పెన్ పవర్, వలేటివారిపాలెం
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విస్తృతంగా పెరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ ప్రగడ ఆదిలక్ష్మి అన్నారు. ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఉదయం అంక భూపాలపురం గ్రామంలో బ్లీచింగ్ చల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలన్నారు . మాస్కులు ధరించి, చేతులు శానిటైజర్ తో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమం లో వైసీపీ పార్టీ నాయకులు, ప్రగడ వెంకటేశ్వర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment