అనుమతులు లేకుండా బోర్లు వేస్తే సీజ్.
6"1/2అంగుళాల బోర్లు అనుమతులు లేవు - ఆర్.ఐ.
పెన్ పవర్, మల్కాజిగిరిమల్కాజిగిరి మండలంలోని అనుమతులు లేకుండా బోర్లు వేస్తే సీజ్ చేస్తామని మల్కాజిగిరి రెవెన్యూ ఇన్స్పెక్టర్ మతిన్ అన్నారు. గురువారం డిఫెన్స్ కాలనీ లో ఓ వ్యక్తి 6"1/2 అంగుళాల బోరు వేస్తుండగా స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు బోర్ వేసుకుంటున్న యజమానికి రూ25వేల జరిమానా విధించారు. వేసవికాలంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి 6"1/2అంగుళాల బోర్లు వేస్తే పరిసర ప్రాంతాల్లో ఉన్న పది బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉందని స్థానికులు వాపోయారు. ఈసందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ కొందరు వ్యక్తులు 4"1/2 ఇంచుల బోర్ల అనుమతులు తీసుకుని 6"1/2 ఇంచుల బోర్లు వేస్తున్నారని, మల్కాజిగిరి మండల పరిధిలో 6"1/2అంగుళాల బోర్వెల్ లకు అనుమతులు లేవని నిబంధనలు అతిక్రమించి ఎవరైనా బోర్లు వేస్తే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.
No comments:
Post a Comment