Followers

కరోనా వ్యాక్సిన్ టీకా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

 కరోనా వ్యాక్సిన్ టీకా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

45 సంవత్సరాలు పైబడిన వారు తప్పనిసరిగా కరోనా టీకా వేసుకోవాలి.

పెద్దవంగర ఎంపీపీ ఈదురు రాజేశ్వరి.


పెద్దవంగర, పెన్ పవర్

మహబూబాద్ జిల్లా పెద్దవంగర జడ్పిఎస్ఎస్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సిన్ టీకా సెంటర్ ను ప్రజలు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని, పెద్దవంగర ఎంపీపీ ఈదురు రాజేశ్వరి అన్నారు. సోమవారం  మండల ప్రజల కోసం కరోనా వ్యాక్సిన్ టీకా సెంటర్ ను స్ధానిక జడ్పిటిసి శ్రీరాం జ్యోతిర్మాయి, డిఎంహెచ్వో డాక్టర్ జి.మురళి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ... కరోనా వ్యాక్సిన్ టీకా సెంటర్ను రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి గౌ"శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ టీకా సెంటర్ ను కొత్తగా పెద్దవంగర మండలానికి మంజూరు చేయించడం  జరిగిందన్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని, అన్నారు. దీనిని సరైన పద్ధతి లో సక్రమంగా వినియోగించుకోవాలని, అన్నారు. టీకా కోసం నమోదు చేసిన రికార్డు వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక ఎంపీటీసీ ఏదునూరి శ్రీనివాస్,పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మగారు, డాక్టర్ విజయ్ కుమార్, తహసిల్దార్ కె.యోగిశ్వర్ రావు, ఎంపీవో కె.యాకయ్య, ఉప సర్పంచ్ శ్రీరాం రాము, శ్రీరాం సంజయ్, బి.లింగమూర్తి, ఎఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు, జీ.పి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...