Followers

పాలకుర్తిలో కో-వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు

 పాలకుర్తిలో కో-వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు

ప్రజలకు కో-వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించడం ఎంతైన అవసరం

పాలకుర్తి జెడ్పీటీసి కందుల సంధ్యారాణి

రామగుండం, పెన్ పవర్ 

 పాలకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం నాడు స్థానిక జెడ్పీటీసి కందుల సంధ్యారాణి కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న ఉచిత వ్యాక్సినేషన్ అందరూ సద్వినియోగ చేసుకోవాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ లో కేసులు అత్యదికంగా పెరిగి వైరస్ ప్రమాదకరంగా మారిందని ఇప్పటికే పాలకుర్తి గ్రామంలో పది పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయని ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని హెల్త్ డిపార్ట్ మెంట్ వారితో మాట్లాడి గ్రామ పంచాయితి పరిధిలో కో-వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చెయ్యడం జరిగిందని అన్నారు. 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం ఎంతో సంతోషకరంగా ఉందని కరోనా వ్యాక్సిన్ తీసుకునే విషయంలో ప్రజలకి తగినంత అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. కో-వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి ఆపోహలకి తావు ఇవ్వకుండా ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో తన వెంట పాలకుర్తి గ్రామ సర్పంచ్ దుర్గం జగన్, ఎంపిటీసి దుర్గం కుమార్, మాదాసు సందీప్ మరియు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...