Followers

అన్ని దానలకంటే రక్తదానం చాలా గొప్పది

 అన్ని దానలకంటే రక్తదానం చాలా గొప్పది

ఆదిత్య ఆసుపత్రి సహకారంతో విజయవంతంగా రక్తదాన శిబిరం

లక్షెట్టిపెట్, పెన్ పవర్

పట్టణంలో గురువారం ఆదిత్య ఆసుపత్రి సహకారంతో అమృత వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్విహించిన రక్తదాన శిబిరం విజయవంతంగా కొనసాగిందని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్స రాల పైబడిన వాళ్ళు కరోన వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అరవై రోజుల వరకు రక్తదానం చేయడానికి వీలుండదని,దీని కారణంగా బ్లడ్ బ్యాంక్ లలో రక్త నిలువలు తగ్గి ఎవరికైనా తలసేమియా ఇతర వ్యాధి గ్రస్థులకు రక్తం అందని పరిస్థితి ఏర్పడుతుందని అలాంటి వల్ల ప్రాణాలను కాపాడడానికే ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.మనం చేసే రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడినవాళ్ళమవుతామని అంతే కాకుండా మనం చేసే రక్తదానంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడిన వాళ్ళవుతామన్నారు.సుమారుముప్పై మంది రక్తదాతలు రక్తదానం చేయగా వారందరిని అమృత బ్లాండ్ బ్యాంక్ ఆదిత్య ఆసుపత్రి మనస్ఫూర్తిగా అభినందించారు.రక్తదానం చేసిన వాళ్లందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వహికులు సతీష్ కుమార్, డాక్టర్ ప్రియాంక, అమృత వాలంటరీలు అనూష తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...