రైతు సంక్షేమమే సహకర సంఘ ద్యేయం.
రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దీర్గకాళిక రుణాలకు సంబందించిన రైతులకు గాను 22,00,000/- లక్షల రూపాయల రుణాన్నిలబ్దిదారుల కు అందజేసారు తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యవసాయన్ని ఒక పండగల చేయాలనీ పిలుపునిచ్చిన నేపథ్యం లో వ్యవసాయ రంగం కొరకు దీర్గకాళిక రుణాలు పెద్ద ఎత్తున ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా పంపిణి చేయటం జరుగుతుంది అని ఈ సందర్భంగా అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి తెలియజేసారు రైతులు ఆర్ధిక స్వావలంబన సాదించాలంటే వ్యవసాయం తో పాటు దాని అనుబంద రుణాలు అయిన డైరీ, గొర్రెలు , పట్టు పురుగులు, కోళ్ళపెంపకం, బోరు మోటార్ పైప్ లైన్, ట్రాక్టర్, హార్వెస్టర్లకు సహకార సంఘాలు ఇచ్చే ధీర్గకాలిక రుణాలు వాడుకొని ముందుకు సాగాలని వారు కోరారు.
లబ్దిదారులు:- 1. కంచర్ల పర్షరములు, పదిర 6,00,000/- డైరీ
2. గెంటే తిరుపతి, వెంకటాపూర్ గొర్రెల పెంపకం 6,00,000/-లక్షలు
3. కె. ప్రభాకర్ రెడ్డి గొర్రెల పెంపకం 10,00,000/-లక్షలు. లబ్ది దారులు పొందిన మొత్తం రుణాలు 22,00,000/-లక్షల రూపాయలు. త్వరలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో అన్ని గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్మి ప్రభుత్వం కల్పించే మద్దతు ధర పొందాలని ఈ సందర్బం గా అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి కోరారు. ఈ కార్యక్రమములో మేనేజర్ సంపూర్ణ, ఫీల్డ్ ఆఫీసర్ నాగరాజు, సంఘ ఉపాధ్యక్షులు జంగిటి సత్తయ్య, డైరెక్టర్ల్లు నేవురి వెంకట నరసింహ రెడ్డి, కోనేటి ఎల్లయ్య, గండ్ర ప్రభాకర్ రావు, ఎగదండి శ్రీనివాస్, కస్తూరి రామ చంద్ర రెడ్డి, సంఘ సీఈఓ కిషోర్ కుమార్, సంఘ సిబ్బంది, రైతులు తది తరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment