Followers

జానపద వీడియో ఆల్బమ్ ను ఆవిష్కరణ

 జానపద వీడియో ఆల్బమ్ ను ఆవిష్కరణ

పెన్ పవర్,  మందమర్రి 

రాకం క్రియేషన్ ,ఏ. ఆర్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్ సంయుక్తంగా రూపొందించిన బావయ్యో నువ్వు రావయ్యో జానపద వీడియోను స్థానిక ఇందు గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ ఎస్.ఐ లింగంపల్లి భూమేష్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు స్వంతంగా యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు చేసుకొని మరికొందరికి అవకాశం కల్పించడం వల్ల వారి ప్రతిభ వెలుగులోకి వస్తుందని ఆయన అన్నారు. కళాకారులు తమకు ఉన్న అవకాశాలను వినియోగించుకుని కళారంగంలో రాణించాలని ఆయన అన్నారు.  ఈకార్యక్రమంలో నృత్య కళా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రాకం సంతోష్, జానపద కళాకారుల సంఘము రాష్ట్ర కార్యదర్శి హనుమాండ్ల మధుకర్, సీనియర్ డాన్సుమాస్టర్ ఉప్పులేటి నరేశ్,డైరెక్టర్ రామగిరి అర్జున్, నటీనటులు పూజ షాన్, శ్రీధర్,కెమెరామెన్ దుర్గం విజయ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...