కరోనా అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్..
పెన్ పవర్, బయ్యారంమహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని రైతు వేదిక నందు జరిగిన మండలంలో కోవిడ్ -19 జాగ్రత్తలు - అందరికి వాక్సిన్ వేయించడం - కోవిడ్ నివారణ పై సమావేశం నందు ముఖ్య అతిధిగా హాజరైన *కుమారి అంగోత్ బిందు, గౌరవ చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్, మహబూబాబాద్ సమావేశంలో మాట్లాడుతూ ఒక సంవత్సరం క్రితం మొదలైన కోవిడ్ వైరస్ లాక్ డౌన్ నందు ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో దాదాపు తగ్గిపోయిందని తర్వాత సడలింపుతో ప్రజలకు కోవిడ్ భయం తగ్గి విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా ఉండడం, పార్టీలు, ఫంక్షన్ లు, ప్రజలను తిరిగి కోవిడ్ బారిన పడేలా చేశాయని రెండవ వేవ్ లో ఇది మరింత గా పెరిగి దేశంలో, రాష్ట్రంలో విస్తరిస్తున్న దని కాబట్టి మనం మరింత జాగ్రత్తలు తీసుకొని ఈ మహమ్మారిని అరికట్టవలసి ఉన్నదని, మండలంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయ వలసి ఉన్నదని ప్రతి సర్పంచ్ ఇతర ప్రజా ప్రతినిధులు ప్రతి గ్రామం నుంచి పదిమంది చొప్పున తీసుకువచ్చిన రోజుకు మూడు వందల చొప్పున వాక్సిన్ వేసినట్లయితే మండలంలోని అందరికి వేగంగా వాక్సిన్ వేయవచ్చని ఏ ప్రగతి సాధించాలన్నా ముందు ఆరోగ్యం బాగుండాలని కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు సర్పంచ్, వార్డ్ సభ్యులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా పనిచేసి మన మండలంను కరోనా రహిత మండలంగా చేసుకుందామని తద్వారా మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసుకుందామని తెలిపారు ఈ కార్యక్రమం లో బయ్యారం PACS చైర్మన్ మూల మధుకర్ రెడ్డి,తహసీల్దార్ నాగ భవాని ఎంపీడీఓ బి. వి. చలపతిరావు, ఎస్ ఐ జగదీష్, బయ్యారం మెడికల్ ఆఫీసర్, గంధం పల్లి మెడికల్ ఆఫీసర్, సర్పంచ్ లు,పంచాయతీ కార్యదర్శులు మండల అధికారులు తెరాస నాయకులు పాల్గొన్నారు
No comments:
Post a Comment