Followers

ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి..

 ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి..

తాళ్లపూడి, పెన్ పవర్

కరోనా సెకండ్ వేవ్ సమయంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతీ ఒక్కరు మాస్కు తప్పనిసరిగా ధరించాలని ఎంపిడిఓ ఎం.రాజశేఖర్ కోరారు. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో జనం నిర్లక్ష్యం వీడి  అప్రమత్తంగా ఉండాలని కోరారు.దేశ వ్యాప్తంగా కరోనా ముప్పు మళ్ళీ కమ్ముకొస్తున్న వేళ మనల్ని మనమే రక్షించుకునేందుకు, కాపాడుకునేందుకు ప్రతీ పౌరుడు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కును ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ప్రజా క్షేమం కోసం మన కర్తవ్యాన్ని నిర్వహించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు అన్ని విధాలుగా కోవిడ్ నియంత్రణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ శ్రమిస్తున్నారన్నారు. ముందస్తుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షించడంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోన నియంత్రణకు ఎన్నో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. అర్హత ఉన్న ప్రతీఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...