Followers

చింతపల్లి జూనియర్ కాలేజీ మైదానంలో వాలీబాల్ టోర్నమెంట్

 చింతపల్లి జూనియర్ కాలేజీ మైదానంలో వాలీబాల్ టోర్నమెంట్ 

చింతపల్లి, పెన్ పవర్

గత 2 రోజుల నుండి విశాఖపట్నం జిల్లా, చింతపల్లి పోలీసులు, మరియు ఐటిడిఎ వారి ఆద్వర్యంలో గ్రామ వాలంటీర్లకు చింతపల్లి జూనియర్ కాలేజీ మైదానంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్‌లో మొత్తం 15 పంచాయతీ జట్లు పాల్గొన్నాయి.చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నుండి 9 జట్లు మరియు అన్నవరం పరిధి పోలీస్ స్టేషన్ నుండి 6 జట్లు పాల్గొన్నారు. ఏ.ఏస్.పి,చింతపల్లి  సమక్షంలో ఈ రోజు ఫైనల్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఎ.ఎస్.పి చింతపల్లి విద్యా సాగర్ నాయుడు ఐ.పి.ఎస్. ప్రధమ విజేత అయనా కుడుముసారి పంచాయతీ వాలంటీర్‌  జట్టుకు రూ:10,000/-, రెండవ బహుమతి లామ్మసి పంచాయతీ వాలంటీర్‌ జట్టుకు రూ:5000/-, మూడవ బహుమతి కొమ్మంగీ పంచాయతీ జట్లుకు రూ;2000/- మరియు మెమెంటోలతో  సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఏస్.పి, చింతపల్లి  వాలంటీర్లు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని, అందరూ వాలీబాల్ టోర్నమెంట్ ను క్రీడాస్పూర్తితో ఆడారని మరియు ఈ టోర్నమెంట్ వారిని ప్రోత్సహించడానికి నిర్వహించామని తెలియజేసారు. వాలంటీర్లు ప్రజలకు మారింత సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి సిఐ టి.శ్రీను, అన్నవరం ఎస్ఐ ప్రశాంత్ కుమార్, శిక్షణ ఎస్‌ఐ రామకృష్ణ, చింతపల్లి శిక్షణ ఎస్.ఐ.,రవీంద్ర మరియు,పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...