నూతన గ్రామ పంచాయతీకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
కేసముద్రం, పెన్ పవర్మహుబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తరాసింగ్ తండా లో నూతన గ్రామ పంచాయతీ భవననిర్మాణంనకు గురువారంమహుబూబాబాద్ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి తండా, గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నాయి అని అన్నారు. అంతేగాక స్థానిక గ్రామ ప్రజలు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకరగా తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పలు సమస్యలను వెంటనే పరిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ వోలం చంద్రమోహన్ , జడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి, సర్పంచులు ఫోరమ్ జిల్లా అధ్యక్షులు మాదరపు సత్యనారాయణ , మండల అధ్యక్ష కార్యదర్శులు ఎండి నజీర్ ,కముటం శ్రీనివాస్ ,పిఏసీఎస్ చైర్మన్ ఢీకొండ వెంకన్న , మహేందర్ రెడ్డి , వీరు నాయక్ , స్థానిక సర్పంచులు , ఎంపీటీసీ , అధికారులు , తెరాస ముఖ్యనాయకులు , తదితరులు , పాల్గొన్నారు.
No comments:
Post a Comment