విమ్స్ లో పడకలు(బెడ్స్) పెంచండి....డాక్టర్స్ ని ఏకీకృతం చేయండి
మహారాణి పేట, పెన్ పవర్
గత సంవత్సరం కరోనా తీవ్రత సమయంలో విమ్స్ నీ రాష్ట్ర కోవిడ్ హాస్పటల్ గా ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ నివారణ కోసం,రోగుల సౌకర్యం కోసం యుద్ధ ప్రాతిపదికమీద ఏ.పి.ఎమ్.ఏస్.ఐ.డి.సి, సహకారంతో విజయవాడ నుంచి 1600 బెడ్స్ మరియు 1600 పరుపులు విమ్స్ లోనీ మూడు బ్లాకులలో రెడీ చేశారు. దీనిలో సుమారు 20 బెడ్స్ ఎల్.జి పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన అత్యవసర సమయంలో తరలించారు. అక్కడి బాధితులకు సేవలందించారు.విమ్స్ లోని మూడు బ్లాకులలో వాటర్ ప్యూరిఫైయర్ 24/7 పై మినరల్ వాటర్ రోగులకు ,సహాయకులకు అందే విధముగా హాట్ అండ్ కోల్డ్ వాటర్ డిస్పెన్సెర్ ఏర్పాటు చేశారు.ఫస్ట్ ఫ్లోర్ మొత్తము ఏసీలు ఏర్పాటు చేశారు. మూడు ఫ్లోర్లో కి కలిపి 50- 60 స్పెషల్ రూమ్స్ ఉన్నాయి.నేవీ వారి సహకారంతో రిమోట్ కంట్రోల్ సహాయంతో పని చేయు 24 వెంటిలేటర్ లను ఏసీ రూమ్స్ లో ఏర్పాటు చేశారు.ఆరు బ్లూటూత్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్లను రోగుల గురించి,వారి సహాయకులకు తెలిసేవిధంగా ఏర్పాట్లు చేశారు.సిబ్బంది అందరికీ సత్వర ఇన్ఫర్మేషన్ కోసము వాకీటాకీ లు ఏర్పాటు చేశారు. విమ్స్ లో ఐ.పి, సి.సి కెమెరా సిస్టము ఉంది. ఇవి డాక్టర్లకు ఇచ్చినచో ప్రతి క్షణము డాక్టర్స్ రోగిని పర్యవేక్షణ చేయవచ్చు.ఇప్పుడు ఈ సిస్టము పని చేస్తున్నదో లేదో ..విమ్స్ లో 150 నుంచి 200 వరకు వెంటిలేటర్స్ కలవు. కరోనా రెండవ దశ తీవ్రతను ముందుగానే గుర్తించడంలో ప్రభుత్వాలు విఫలం అయినాయి.
విశాఖను మెడికల్ హబ్ గా భావించి, విశాఖ డాక్టర్లపై , హాస్పిటల్స్ పై నమ్మకముతో పక్క రాష్ట్రాలైన ఒరిస్సా, చత్తీస్గడ్ నుంచి మరియు ఈస్ట్ గోదావరి,శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వచ్చిన రోగులు ఇక్కడ వైద్యం పొందుతూ ఉన్నారు కాబట్టి ఈ రోగులకి ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ను విశాఖ కలెక్టర్ కి కేటాయించాలి.ఇతర రాష్ట్రాలు,ఇతర జిల్లాల నుంచి వచ్చిన రోగులను జిల్లాల వారీగా బ్లాక్లలో పడకలు ఏర్పాటు చేసి ఆ రోగులకోసం ఆ జిల్లాల నుంచి వైద్యులు,వైద్య సిబ్బంది ఎల్,పారామెడికల్ సిబ్బంది ని వారానికి ఒక్కసారి రొటేషన్ పద్ధతిలో నియమించాలి. వైద్యం నిమిత్తము ఇక్కడికి వస్తున్నారు రోగులకు వారి నమ్మకాన్ని నిలబెట్టే విధముగా వైద్యులు కృషిచేసి సక్సెస్ రేటు పెంచాలి.ఇన్ని సౌకర్యాలు ఇన్ని బెడ్స్ కలిగి ఉన్న విమ్స్ ని ,రోగుల సౌకర్యం కోసం ఇక్కడే వైద్యులను,వైద్య సిబ్బందిని ఏకీకృతం చేసి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని,బెడ్స్ లేక,దొరకక నానా అవస్థలు పడుతున్న రోగులకు విమ్స్ ద్వారా స్వాలంబన చేకూర్చాలని 1600 పడకలను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని రోగులకు కేంద్ర ప్రభుత్వము జారీచేసిన మార్గదర్శకము లను పాటిస్తూ పౌష్టిక ఆహారం అందించినచొ రికవరీ రేటు పెరుగుతుందని అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ లోనూ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ప్రతి డాక్టరు రోగికి కొవిడ్ నియంత్రించుటకు రేమిడిసివర్ ఇంజెక్షన్ రోగి కోసము ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారని దీని ఖరీదు బయట బ్లాక్ మార్కెట్లో 15 వేల నుంచి 40 వేల వరకు ధరను మెడికల్ మాఫియా డిమాండ్ చేస్తున్నారని ప్రభుత్వము వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలకు రేమిడిసివర్ ఇంజెక్షన్ అందుబాటులోకి తేవాలని కోరారు.వైద్యులు,వైద్య సిబ్బంది,పారిశుద్ధ్య పని వారు,ఎఫ్.ఎన్.ఓ,ఎమ్.ఎన్.ఓ ల సంఖ్యను పెంచి కరోనా ను కట్టడి చేయడానికి జిల్లా యంత్రాంగము తక్షణమే తగు చర్యలు తీసుకుంటే కోవిడ్ నియంత్రణ సాధ్యమవుతుంది.వైద్యులకు, వైద్య సిబ్బందికి,పని వారు కు భీమా పథకమును వర్తింపచేయాలి. పి.పి.ఈ కిట్లు, గ్లోవ్స్ లు, మాస్కులు నిరంతరం సరఫరా చేయాలి.రోగనిరోధక శక్తి కలిగి ఉన్న యువ డాక్టర్స్ ను,సీనియర్ డాక్టర్స్ పర్యవేక్షణలో రోగులకు వైద్యము అందేలాగా అంకిత భావంతో పని చేయాలి.60 సంవత్సరాలు పైబడిన డాక్టర్స్ ను కేవలం సలహాలు,పర్యవేక్షణ కి ఉపయోగించుకోవాలి వార్డులలో కి రోగులకు వైద్యం నిమిత్తము పంపరాదు. అన్ని సౌకర్యాలు కలిగిన విమ్స్ ను జిల్లా అధికార యంత్రాంగం,వైద్యులు,వైద్య సిబ్బంది ప్రజల సహకారంతో సమస్యలను అధిరోహించి సక్సెస్ రేట్ పెంచుటకు కృషి చేస్తే విమ్స్ కు మంచి పేరు వస్తుంది.
No comments:
Post a Comment