అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయించండి
రాచకిండాం గ్రామంలో అంబేద్కర్ మరియు రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ప్రతిష్ఠించుటకు ఖాళీ స్థలం మంజూరు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి గజపతినగరం నియోజకవర్గ కన్వీనర్ పెంట శంకరరావు గ్రామ పెద్దలతో కలిసి బొండపల్లి మండల రెవిన్యూ అధికారికి వినతిపత్రాన్ని గురువారం సమర్పించారు. ఈ సందర్భంగా శంకర్ రావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న దళితులకు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకొనుటకు స్థలం కేటాయించమని అనేక సందర్భాలలో విన్నవించినా అధికారులు బుట్టదాఖలు చెయ్యడం అన్యాయం అని ఆవేదన వ్యక్తంచేశారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి అంబెడ్కర్ విగ్రహానికి స్థలము కేటాయించకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని శంకర్ రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి విజయనగరం నియోజకవర్గ కన్వీనర్ అయినాడ కృష్ణ, అప్పారావు మరియు రచకిండాం గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment