గిడ్డంగుల కార్మికుల దర్నా..
కార్మికుల వేతనం నుండి కట్ చేసిన ఈఎస్ఐ..పిఎఫ్ డబ్బులు కట్టడం లేదని దర్నా.
కాంట్రాక్టు కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న యాజమాన్యం.. కాంట్రాక్టర్లు..
ఏండ్ల తరబడి పనిచేస్తున్నా వేతనాలు పెంచడంలేదని గిడ్డంగులముందు బైటాయింపు..
పనివేళలు సక్రంమగా అమలు చేయకుండా గొడ్డు చాకిరి చేయిస్తున్నారని కార్మికులు దర్నా..
ఎల్లంపేట గ్రామ ఎంపిటీసి కుమార్ జోక్యంతో సద్దుమనిగిన కార్మికుల దర్నా..
మేడ్చల్, పెన్ పవర్
ఆనాటి నుండి ఈనాటి వరకు కాంట్రాక్టు కార్మికుల సమస్యలు సమస్యలుగానే ఉండి పోతున్నాయి.. వేతనాలలో కోతపెట్టి ఇచ్చే కాంట్రాక్టర్ ఒకరైతె.. ఈఎస్ఐ పిఎఫ్ లు ఇవ్వకుండా మరికొందరు మోసంచేస్తూ కార్మికుల కష్టాన్ని కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు.. కార్మికులు తమ సమస్యలతో దర్నాలు చేయడం, యాజమాన్యం తాత్కాలిక ఒప్పందాలతో సరే అనడం పరిపాటిగా మారింది.. సమస్య తీరేది లేదు.. యాజమాన్యాలు, కాంట్రాక్టర్లు మారేది లేదు.. కార్మికులకు జీవితకాలం ఇలాగే గడిసిపోతుంది..కాంట్రాక్టర్లు కోటిశ్వరులు అవుతున్నారు కార్మికులు మాత్రం అదేపని, అవేసమస్యలు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం ఎల్లంపేట గ్రామ పరిధిలోని మాక్స్ కంపెనీ గిడ్డంగులలో పనిచేసే కార్మికులు వేతనాలు పెంచాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిడ్డంగులముందు బైటాయించి కార్మికులు గురువారం దర్నా నిర్వహించారు.కంపెనీ యాజమాన్యం.కాంట్రాక్టర్లు తమకు పనివేళలు సక్రమంగా అమలు చేయడం లేదని,సెలవులు కూడా ఇవ్వకుండా తమతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. తమ వేతనాల నుండి ఈఎస్.ఐ.పీ.ఎఫ్ కోసం డబ్బులు కట్ చేసుకుంటున్నారు కానీ తమకు ఈఎస్.ఐ.పీఎఫ్ కడుతున్నట్లు పత్రాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.., ఏళ్ల తరబడి పనిచేస్తున్నా వేతనాలు పెంచడం లేదంటూ కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. వేరేహౌస్ గేటు ముందు బైఠాయించి నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.. నిరసన తెలియజేశారు.ఎల్లంపేట్ గ్రామ ఎంపీటీసీ కుమార్ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు తమ ఆందోళన విరమించి విధుల్లోకి వెళ్లారు..
No comments:
Post a Comment