బెల్లంపల్లి ఎం ఎల్ ఏ క్యాంప్ కార్యాలయం పరిసరం లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చెయ్యాలి
బెల్లంపల్లి, పెన్ పవర్
బెల్లంపల్లి నియోజకవర్గం లో దాదాపు లక్ష 50 వేలమంది లో ఎక్కువ శాతం 18 సంవత్స్రాలు పై బడిన వ్యక్తులు కలరు వృద్ధులకు మరియు 45 సం వత్స్రాలు పై బడిన వ్యక్తులు లో కొందరు వ్యాక్సిన్ వేసుకున్నకూడా అత్యధిక జనాభా 18 -44 మధ్య వయస్సు వ్యక్తులు కలరు . కనీస సౌకర్యాలు కల్పించకుండా అవగాహన కల్పించకుండా సింగరేణి హాస్పిటల్ లో వైద్యులను వ్యాక్సిన్ కి సిద్ధం గా ఉండమనటం ఎం ఎల్ ఏ కు హేతు బద్దం గా లేదు. దాదాపు లక్ష పై చిలుకు వ్యక్తులకు దాదాపు 7 నుంచి 8 ప్రాథమిక మరియు కమ్యూనిటీ హాస్పిటల్ లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారో ప్రజలకు చెప్పాలి . లక్ష మందికి 8 నుంచి 10 వైద్య కేంద్రాలలో వ్యాక్సిన్ కొరకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారో శ్వేతపత్రం విడుదల చెయ్యాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ వ్యాక్సిన్ కొరకు ఆన్లైన్ అప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి తదనుగుణం గా సంబంధిత హాస్పిటల్ లో వ్యాక్సిన్ సెంటర్ కి వెళ్ళాలి అని సూచిస్తున్నాయి కానీ ఏ హాస్పిటల్ లో రిజిస్టర్ అయిన వ్యక్తుల వివరాలు సరిచూడు సిబ్బంది లేరు కనీస వసతులు లేవు ప్రాధమిక వైద్య కేంద్రాలకు వచ్చు నిధులు వైద్యులు పేపర్ ల మీద చూపెట్టి స్వాహా చేస్తున్నారు కానీ వ్యాక్సిన్ సమయం లో కనీస అవసరాలకు ఖర్చు చెయ్యటం లేదు వ్యాక్సిన్ కోసం వచ్చు వారికీ నీటి సౌకర్యం వేచి ఉండు టకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు వికలాంగులకు మానసిక వికలాంగులకు వృద్దులకు సహాయం చేయుటకు ఎవరు లేరు వీల్ చైర్ సౌకర్యం లేదు చదువు రాణి వారికి సహాయం చేయు వ్యక్తులు,సిబ్బంది లేరు నియోజక వర్గ నిధులు 5 కోట్లు కేటాయించినా ఎప్పుడు వారు వైద్య అవసరాలకు కేటాయించలేదు. కనీసం ఇప్పుడు అయినా ప్రాధమిక వైద్య కేంద్రాల లో కమ్యూనిటీ హాస్పిటల్ లో కనీస అవ్సరాలు ఏర్పాటు చెయ్యటానికి కేటాయించాలి సింగరేణి కోవిడ్ హాస్పిటల్ లో ఆక్సిజన్ సిలిండర్ ల కొరత లేకుండా చూడాలి. నియోజకవర్గము లో ప్రతి మండల ము లో ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో ఉంచాలి ఒక వేళ ప్రభుత్వ అంబులెన్స్ లేనట్లు అయిథెయ్ 3 నెలలకు అద్దె ప్రాతిపదిక లో అయినా అంబులెన్స్ లు ప్రయివేట్ వ్యక్తుల వద్ద నుంచి సుమండిత మున్సిపల్ మండల ఆఫీస్ లు తీసుకోవాలి వాటికి ఆవు ఖర్చు మున్సిపల్ మండల ఆఫీస్ లు భరించాలి . బెల్లంపల్లి అఖిలపక్షం డిమాండ్ చేస్తోంది లేనియెడల ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తాం అని అన్నారు ఈ కార్యక్రమంలో. గెల్లీ జయరాం యాదవ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుండ చంద్ర మాణిక్యం సి.పి.ఐ పట్టణ కార్యదర్శి అమానుల్లాఖాన్ టి.డి.పి జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల మధు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గో గర్ల శంకర్ రెడ్ స్టార్ పార్టీ సి.పి.ఐ ఎం.ఎల్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాశీ సతీష్ కుమార్ ఇండియా ప్రజాబంధు పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహమ్మద్ గౌస్ హెచ్.ఎం. ఎస్ నాయకులు ఆడెపు మహేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు..
No comments:
Post a Comment