గర్భిణీలకు వైద్య పరీక్షలు...
ఇంద్రవెల్లి, పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక వైద్యులు శ్రీకాంత్, నీలోఫర్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీహెచ్ఓ రాథోడ్ బాబులాల్ తెలిపారు. ఐటిడిఎ ఆధ్వర్యంలో గర్భిణీలకు పోషకాహారం తోపాటు పండ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరుపుకోవాలని సూచించారు. గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది జ్యోతి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment