మానవత్వం చాటుకున్న వెంకటాపురం గ్రామ సర్పంచ్ శీలం లింగన్న గౌడ్
తొర్రూరు, పెన్ పవర్మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఇప్పటివరకు చాప కింద నీరులా విలయ తాండవం విజృంభిస్తున్న కరోనా మహమ్మారి భారీ నుండి గ్రామ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, వెంకటపురం గ్రామ సర్పంచ్ శీలం లింగన్న గౌడ్ అన్నారు.. ఈ సందర్భంగా గురువారం మాట్లాడుతూ... గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఒక్కరోజులోనే అస్వస్థతకు గురికావడంతో, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందించిన 108 అంబులెన్స్ ను వెంటనే పిలిపించి, వరంగల్ ఎంజీఎంకు తరలించడం జరిగిందని, అన్నారు. కావున ప్రజలు రెండవ వేవ్ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. కరోనా వ్యాక్సిన్ టీకాను 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని, సర్పంచ్ కోరారు.గ్రామ సర్పంచ్ చేసిన సేవను పలువురు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం అనురాధ, ఆశ కార్యకర్త విజయ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment