మేయర్ దంపతులకు వేద పండితుల ఆశీర్వచనం
మహారాణి పేట, పెన్ పవర్
విశాఖ మహానగర మేయర్ దంపతులకు వేద ఆశీర్వచనం నగరపాలక సంస్థ మేయర్ చాంబర్లో మహా నగర విశాఖ మేయర్ జి హరి వెంకట కుమారి, శ్రీనివాస్ దంపతులకు వేద ఆశీర్వచనం జరిగింది. ఉత్తరాంధ్ర వైఖానస యూత్ ఫోరం అధ్యక్షులు శ్రీమాన్ పి.రంగనాథఆచార్య స్వామి వారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఉపాధ్యక్షులు శ్రీమాన్ ఆర్ సింగరాచార్య స్వామి వివిధ ఆలయాల అర్చకులు వేద మంత్రాలతో నగర మేయర్ దంపతులను ఘనంగా ఆశీర్వదించారు అనంతరం సింగరా చార్య స్వామివారు మాట్లాడుతూ పుష్కర కాలం తర్వాత ఏర్పాటైన తొలి కౌన్సిల్ సమావేశం నగర మేయర్గా మీ అధ్యక్షతన జయప్రదంగా జరగాలని మీ పరిపాలన కాలంలో మీ అధ్యక్షతన విశాఖనగరం సర్వాంగసుందరంగా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త యమ్.వి రాజశేఖర్, పి.రామకృష్ణమాచార్యులు, ఎన్.శ్రీధర్ రామసద్గుణ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment