Followers

పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ

 పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ.. కార్పొరేటర్ శిరీష రెడ్డి

పెన్ పవర్,  కాప్రా

భారతదేశంలో రెండవ దశ కరోణ వైరస్ వేగంగా ప్రబలుతున్న  నేపథ్యంలో "పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ' అన్న నినాదంతో డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలు, రహదారులు, చౌరస్తాలు పరిశుభ్రంగా ఉంచాలన్న ఏకైక లక్ష్యం తో ముందుకు వెళ్తున్న డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో. మంగళవారం ఉదయం డివిజన్ పరిధిలోని కమల నగర్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ తదితర ప్రాంతాలలో హైడ్రో క్లోరోక్విన్ ద్రవ్యాన్ని స్వయంగా పిచికారీ చేశారు.  ఈ సందర్భంగా కార్పొరేటర్ శిరీష మాట్లాడుతూ.. ప్రబలుతున్న రెండవ దశ కరోణ వైరస్ వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని అన్నారు. ప్రభుత్వం సూచించిన కోవిడ్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు.   ఈ కార్యక్రమంలో కుషాయిగూడ సీఐ మన్మోహన్, డి ఐ గురువారెడ్డి, ఎస్సైలు అనంత చారి, శ్రీనివాస్, మదన్ లాల్, టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కొత్త అంజి రెడ్డి, బొర్రా రాఘవ రెడ్డి, బేతాళ బాల్ రాజు, పెంటయ్య గౌడ్, దత్తు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...