ప్రభుత్వ ఆసుపత్రి ఓ.పి సేవలు నిర్వహించాలి
జీవన మరణం సమస్యగా మారిన ఓ.పి సేవలుసబ్ కలెక్టర్ కార్యాలయం లో వినతిపత్రం అందజేత- కురువెళ్ల భానుచందర్, కందికొండ రమేష్
రాజమహేంద్రవరం,పెన్ పవర్
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. పేద మధ్య తరగతి రోగులకు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాణదాత మరియు దేవాలయంలా భావించే సామాన్య ప్రజలకు వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జి.జి.హెచ్ బోర్డ్ డైరెక్టర్ మరియు ప్రజా సంఘ నాయకుడు సామాజిక వేత్త కందికొండ రమేష్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రోగిని పరీక్ష చేసి వ్యాధినిర్ధారణ వ్యాధి తీవ్రతను పరిశీలించి ఈ వ్యాధి నివారణ మందులతో నయం అవుతుంది అని డాక్టరు తెలియజేస్తే వారంలో చనిపోయారు కూడా సంవత్సరాల కాలం బ్రతుకుతాడు అని అందులో నిజానికి ఆమందులలో లేని శక్తి డాక్టర్ నోటినుండి వెలువడే మాటే కాదు ధైర్యంగా ఉండు అని డాక్టర్లు అంటే చాలు అని ప్రభుత్వ ఆసుపత్రి ఉండబడే రోగి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుందని ఆయన మాట్లాడుతూ అన్నారు.
సామాజిక వేత్త మరియు జై భీమ్ సేన ఉద్యమ సంఘ రాష్ట్ర చైర్మన్ కురువెళ్ల భానుచందర్ మాట్లాడుతూ ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి నీ కరుణ వైరస్ కారణంగా ఆస్పత్రి గా మార్చడం జరిగింది దీనివల్ల నిత్యం వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడే రోగులు వైద్యం కోసం అక్కడికి వచ్చే పేద మధ్య తరగతి ఉద్యోగులు ఆందోళన గురవుతున్నారని ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకో స్తోమత లేని వారు అక్కడ డాక్టర్ కన్సల్ట్ ఫీజు ఏకంగా 500 నుండి వెయ్యి రూపాయల వరకు ఖర్చయ్యే ఈ రోజుల్లో దానికితోడు కరోన టెస్టులు లేనిదే డాక్టర్ చూడట్లేదు అనే ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ.పి నిర్వహణ ఆపడం పేద ప్రజలకు జీవన మరణ సమస్యగా మారుతుంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖ వారు జిల్లా కలెక్టర్ వారు తక్షణమే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు కొనసాగే విధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని ఈ సందర్భంగా మాట్లాడారు.అనంతరం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం లో అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త హ్యూమన్ రైట్స్ జిల్లా చైర్మన్ ధర్నాలకోట వెంకటేశ్వరరావు,ది.గోదావరి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ డి.ఎం.డి అబ్దుల్ రాజాక్ మరియు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment