Followers

జీలుగ మత్తులో జోగుతున్న మన్యం

 జీలుగ మత్తులో జోగుతున్న  మన్యం
 వేసవిలో విస్తారంగా  జీలుగ కల్లు దిగుబడి
 ఆదివాసి సంప్రదాయంలో ప్రధాన భూమిక జీలుగ

పెన్ పవర్,  విశాఖపట్నం

  కల్లు  అనగానే తాటి ఈత  చెట్ల నుంచి తీసిన కల్లు గుర్తుకు రాకమానదు. కానీ ఏజెన్సీలో మాత్రం జీలుగ  చెట్ల నుంచి కల్లుని  గిరిజనులు తీస్తారు. జీలుగ అనగానే పంట పొలాల్లో ఎరువుగా వాడే  పచ్చిరొట్ట  జీలుగ అనుకుంటే పొరపాటే. మైదానంలో తాటి చెట్ల మాదిరి ఏజెన్సీలో  ఏపుగా పెరిగిన జీలుగ చెట్లు విస్తారంగా దర్శనమిస్తాయి.జీలుగ కల్లును గిరిజనులు వరప్రసాదంగా  భావిస్తారు. గిరిజన సంప్రదాయం లో జరిగే పండుగలు శుభకార్యాల్లో జీలుగ కల్లు ఉండి తీరాల్సిందే. జీలుగ చెట్ల నుండి తీసిన కల్లు శ్రేష్టమైనది  ఆరోగ్యకరంగా ఉంటుందని గిరిజనుల నమ్మకం. ఆడ మగ  చిన్న పిల్లలు సైతం  జీలుగు కల్లు ప్రీతిగా  సేవిస్తారు.

కల్లు సేవించడం వల్ల గుండె జబ్బులు దూరమవుతాయని గిరిజనుల నమ్మకం. జీలుగ కల్లు మత్తు తో పాటు దీర్ఘకాలం ఆదాయం చేకూరడంతో గిరిజనుల్లో పెరట్లో తప్పనిసరిగా జీలుగ చెట్లను  పెంచుతున్నారు. జీలగ చెట్టు నాటిన  20 ఏళ్ల తర్వాతే కాల్లు దిగబడి  వస్తుంది. విత్తనాలు మొక్కలు అరుదుగా లభిస్తాయి. కల్లు తీయని గెల నుంచి మాత్రమే  విత్తనాలు తయారవుతాయి. ఒక గెల నుంచి జీలుగ కల్లు  రెండు మూడు నెలలకు పైగా దిగుబడి ఇస్తుంది. నిత్యం ఆదాయం ఇచ్చే జీలుగు కల్లు  తీయడానికి గిరిజనులు ఆసక్తి కనబరుస్తారు. జీలుగ చెట్టు ఏపుగా పెరిగిన తర్వాత మొవ్వు లో నుంచి గెల వస్తుంది. ఈ గెల మొగ్గ దశలో తుంచి కుండను వేలాడదీస్తారు.గెల చివర పొర పల్చగా రోజు తీస్తారు.కల్లు చుక్కచుక్క కుండలో కారుతాది.ఈ ద్రవం తీపి గా ఉంటుంది. 

కిక్కు కోసం రెల్ల చెక్క కుండలో వేస్తారు. చెక్క నాని మత్తు ని ఇస్తుంది. జీలుగ చెట్ల నుండి కల్లు మూడు పూటలు తీస్తారు. కల్లు తీస్తున్న జీలుగ చెట్టు ఇతరులు ఎవరు ఎక్క కూడదన్న ఆంక్షలు ఉంటాయి. ఆకరికి చెట్టు యజమాని ఐనా ఎక్కడా నికి వీల్లేదు.జీలుగ చెట్టు నుండి కల్లు తీసే పరిజ్ఞానం కలిగిన వ్యక్తే ఎక్కాలి.ఈ వ్యక్తి ని 'కీతర్' అంటారు. ఇతని పనికి కల్లు కూలిగా ఇస్తారు. చెట్టు వద్ద చెంబు కల్లు పది రూపాయలు. దళారీ లు ఇరవై కి అమ్ముతారు. అవసరం మేరకు అక్కడ కల్తీ జరుగుతుంది. రోజుకు రెండు బిందెలకు పైగా కల్లు దిగుబడి ఇస్తాది.ఒక గెల లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుందనే అంచనా. మొదటి మొవ్వులో వచ్చిన గెల ఆతరువాత దిగువ నున్న ఆకు రెమ్మల్లో నుండి గెలలు పుట్టు కు వస్తాయి. ఎన్ని ఆకులు ఉంటే అన్ని గెలలు వచ్చి కల్లు ఇస్తుంది. జీలుగ చెట్ల కల్లు కిక్కు ఏజెన్సీ కి వచ్చి పోయే వారికి తెలుసు. ఈజీగా చెట్లు పట్టణాల్లో గ్రీన్ గార్డెన్ లలో  పార్కుల్లో దర్శనమిస్తున్నాయి. అయితే మైదాన ప్రాంతంలో జీలుగ చెట్లుకల్లు దిగుబడి రాదని గిరిజనుల నమ్మకం. గిరిజనులు జీలుగ కల్లుని పితృదేవతలకు నైవేద్యంగా పెడతారు. దళారీ లు నిల్వచేసిన కల్లును వారపు సంత లకు తెచ్చి అమ్ముతారు.జీలుగు కల్లు తాగడానికి ఎండిన ఆనప డోకుని ఉపయోగిస్తారు. గిరిజనులు వ్యవసాయ పనులకు సైతం జీలుగు కల్లు  తీసుకుపోతారు.  పనుల్లో సహాయానికి వచ్చే  గిరిజనులకు జీలుగు కల్లు తో  విందు ఇవ్వడం సాంప్రదాయం.  శుభకార్యాల్లో జీలుగ కల్లుతో బొడ్డేంగుల (ఈతపురుగుల)  కూర  పెడితే  గిరిజనులకు మహదానందం.జీలుగ చెట్లు విశాఖ  ఏజెన్సీలోని   పెదబయలు ముంచంగిపుట్టు  జి.మాడుగుల  హుకుంపేట  చింతపల్లి మండలాల్లో అత్యధికంగా కనిపిస్తాయి. పట్టణాలరోడ్ల మధ్యలో  ఏపుగా కనిపించేవే జీలుగ చెట్లు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...