అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన..
ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం..
రూ.19 లక్షలతో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే..
కుత్బుల్లాపూర్, పెన్ పవర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని రింగ్ బస్తిలో రూ.19 లక్షలతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను సోమవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ తో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో నిధుల కొరత లేకుండా ప్రతి బస్తీ, కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ శాశ్వత పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వేణు యాదవ్, జైహింద్, మారయ్య, హజ్రత్ అలీ, బాబు గౌడ్, రుద్ర అశోక్, పాపుల్ గౌడ్, మల్లారెడ్డి, యాదగిరి, సంతోష్ పటేల్, రూప్ సింగ్, వెంకటేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment