శేష జీవితం మంచి ఆరోగ్యంతో ఆనందంగా గడపండి
చిత్తూరు, పెన్ పవర్
దాదాపు 38 సం౹౹ పాటు అంకిత భావంతో అందించిన సేవలు పోలీసు శాఖ గుర్తుంచుకుంటుందని ఎస్పి గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీసు డిపార్టుమెంటు నందు పనిచేయడం సవాలు తో కూడుకొన్నదని, కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నిబద్ధతతో పోలీసు విధులు నిర్వర్తించినందుకు పోలీసు శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. పదవీ విరమణ తరువాత కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. మీ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో గడపాలని, మీ కుటుంబ సభ్యులతో మీ యొక్క ఈ ప్రయాణం సుఖ సంతోషాలతో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.
పదవీ విరమణ తర్వాత కూడా మీరు పోలీసు కుటుంబం లో సభ్యులేనని, ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదించాలని సూచించారు. స్థానిక పోలీసు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాలులో ఏప్రిల్ నెలలో పదవీ విరమణ పొందిన అధికారులు శ్రీ కే. మునిరత్నం రెడ్డి, ఆర్ ఎస్ ఐ చిత్తూరు, శ్రీ కే. వీర శేఖర్ రెడ్డి, ఆర్ ఎస్ ఐ చిత్తూరు, శ్రీ కే. హేమా రెడ్డి, ఆర్ ఎస్ ఐ చిత్తూరు, శ్రీ సి. బాబు, ఏ ఆర్ ఎస్ ఐ చిత్తూరు, శ్రీ వి. రఘు, ఏ ఎస్ ఐ రొంపిచెర్ల పి ఎస్ లను వారి కుటుంబ సమేతంగా ఘనంగా సన్మానించి జ్ఞాపికలను మరియు విలువైన బహుమానాలను అందచేశారు. ఈ కార్యక్రమానికి ఏఆర్ డిఎస్పి లు శ్రీ లక్ష్మి నారాయణ రెడ్డి. శ్రీ కృష్ణ మోహన్, ఆర్ ఐ అడ్మిన్ శ్రీ జావిద్, శ్రీ కే.ఎన్. మురళి, ప్రెసిడెంట్, రిటైర్డ్ పోలీస్ అసోసియేషన్ ఆఫీసర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment