నీటి సమస్యలు తీరుస్తాం... కార్పొరేటర్ ప్రభుదాస్
పెన్ పవర్, కాప్రా
కాప్రా సర్కిల్ పరిధిలో మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లో కాలనీ వాసుల నీటి సమస్య ఉందని కాలనీవాసులు కార్పొరేషన్ దృష్టికి తీసుకురావడంతో అధికారులతో కలిసి కార్పొరేటర్ కాలనీ లో పర్యటించారు. ఎన్టీఆర్ నగర్, నరసింహ నగర్, శాంతి నగర్, అన్నపూర్ణ కాలనీ తదితర ప్రాంతాలలో వాటర్ వర్క్స్ డీజీఎం కృష్ణ తో కలిసి అయా ప్రాంతాల్లో పర్యటించి నీటి సమస్యలను గుర్తించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వేసవి కాలం మొదలైందని నీటి కొరత సమస్య లేకుండా సకాలంలో నీరు అందించాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వాటర్ లైన్ మెన్ నవీన్, కాలనీ వాసులు వాసు, శ్యామ్, రాజు, భద్రయ్య, రమేష్, రాజేశం తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment