వైజాగ్ ఫిల్మ్ సొసైటీ గౌరవ అద్యక్షునిగా ఎన్.ఏ.డి.పాల్
మహారాణి పేట, పెన్ పవర్
ఇటీవల ఏ.యు హెచ్.ఆర్.డి. సెంటర్ సంచాలకులు గా నియమితులైన అచార్య పాల్ వైజాగ్ ఫిల్మ్ సొసైటీ( వి.ఎఫ్.ఏస్) గౌరవ అధ్యక్షులుగా నియమితులయ్యరు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఏ.యు, హెచ్.ఆర్.డి సెంటర్ లో కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేసి వైజాగ్ ఫిల్మ్ సొసైటీ సభ్యులు పాల్ ను కలసి అబినందనలు తెలిపారు. పాల్ మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. సొసైటీ ద్వారా మంచి సినిమాలు ప్రదర్శించడంతో పాటు చిత్ర పరిశ్రమ ప్రగతికి సమంతర సినిమాలు నిర్మాణాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ఎయు విసి ప్రధాన పొషకులుగా వ్యవహరిస్తున్నరు. పాల్ ను కలిసిని వారిలో నరవ ప్రకాశరావు, పివి.రమణ,జి.సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment