ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన ఎంపీడీఓ, ఏపిఓ...
నార్నూర్, పెన్ పవర్నార్నూర్ మండలం లోని నాగల్కొండ, ముక్తాపూర్, మారపాగూడ, గ్రామ పంచాయతీ క్షేత్ర స్థాయి లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను శనివారం ఎంపీడీఓ రమేష్, ఏ పి ఓ జాదవ్ శేషరావు,తో కలిసి పనులను తనిఖీ చేశారు. జాబ్ కార్డు లో ఉన్న ప్రతి ఒకరికి ఉపాధి కలిపించాలని కార్యదర్శి లను ఆదేశించారు. మాస్టర్ రోల్ లో నమోదు చేసిన కూలీల హాజరును పరిశీలించారు. పని చేయని కూలీల పేర్లు మాస్టర్ రూల్ లో నమోదు చేస్తే చర్యలు తప్పవని కార్యదర్శులకు టీఏ లకు హెచ్చరించారు.వారి వెంట పంచాయతీ సెక్రటరీ లు, టీ ఏ లు, కూలీలు ఉన్నారు.
No comments:
Post a Comment