Followers

లక్షల్లో నిధులున్న అభివృద్ది శూన్యం

 లక్షల్లో నిధులున్న అభివృద్ది శూన్యం

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..!

అభివృద్దికి నోచుకోని రామగుండం ఎస్సీ-ఎస్టీ కాలనీలు




రామగుండం , పెన్ పవర్

తరాలు మారిన మా తల రాతలు మారవు అనే నానుడికీ నిలువెత్తు నిదర్శనంగా రామగుండం ఎస్సీ ఎస్టీ కాలనీ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని లక్షల్లో నిధులు కేటాయింపు జరిగిన ఓ మూలన మూలుగుతూ ఉన్న వాటిని సద్వినియోగం చేసి అభివృద్ది చేయడానికి ఏ ప్రజాప్రతినిధికి కూడా మనసు రావడం లేదని మరెందుకో తెలియడం లేదని బహుష మా కాలనీ ఎస్సు ఎస్టీ బిడ్డలుగా అవడమే మేమంతా దళితులు కావడమే మా శాపమా..? అని ఏళ్ళు గడిచిన ఎక్కడి గొంగళి అక్కడే అన్నంటుగా మా బ్రతులు ఉన్నాయని  రామగుండం ఎస్సీ ఎస్టీ కాలని చెందిన ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. జరుపుల శ్రీను నాయక్ అనే వ్యక్తి స్టేట్ మెంట్ తమ కాలనీ పరిస్థితి మరీ ఆగమ్యగోచరంగా తయారైందని మురికి నీటితో పందుల సైర విహారాలు చేస్తున్నాయని స్వచ్ఛ్ తెలంగాణ ఎక్కడ ఉందని రోడ్డు వ్యవస్థ కూడా సరిగా లేక కాలని ప్రజలంతా నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాధుడే లేడని జరుపుల శ్రీను నాయక్ ఆరోపించారు. తెరాస సర్కారేమో బంగారు తెలంగాణ చేయాలనే మాటలే తప్పా అభివృద్దిలో మాత్రం ఎక్కడా కూడా కనిపించడం లేదని గతంలో కూడా ఇదే తెరాస ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రామగుండం నగర పాలక సంస్థకు కేటాయించిన 100 కోట్ల ముఖ్య మంత్రి అసురేన్స్ నిధులలో ఎస్సీ ఎస్టీ లకు కేటాయించిన 2.56 కోట్ల ఎస్టీ నిధులు, అదేవిధంగా 97 లక్షలు ఎస్సీ నిధులకు గత పాలకవర్గ సమయంలోనే టెండర్లు పూర్తి చేసుకుని వర్క్ ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. కానీ అప్పుడు ముందస్తు శాసనసభ ఎన్నికలు రావడం వలన ఎన్నికల కోడ్ నేపథ్యంలో  కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టలేదని కనీసం ఈ కొత్త పాలకవర్గం లోనైన ఆ నిధులను వృధా చేయకుండా సద్వినియోగం చేసి అభివృద్ది చేస్తారేమో అంటే పాలకులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహర్తిస్తున్నారని అంతే కాకుండా ఎస్సీ ఎస్టీ నిధులను తన కాలనీలో కాకుండా వేరే కాలనీలోకి మళ్ళీంచి అక్కడ పనులు చేపడుతున్నారని వారు ఆరోపించారు. గత 40 సవంత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోని మా కాలనీ లకు మరియు మా ఎస్సీ ఎస్టీ లకు అన్యాయం చేస్తున్నారని ఇకనైన జిల్లా కలెక్టర్ మరియు రామగుండం నగర పాలక కమిషనర్ దృష్టిసారించి వెంటనే స్పందించి తమ కాలనీని అభివృద్ది చేయాలని జరుపుల శ్రీను నాయక్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...